బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 8 నవంబరు 2023 (21:44 IST)

హోండా ఇండియా పవర్ ప్రొడక్ట్స్: పండుగ సీజన్‌లో స్క్రాచ్ అండ్ విన్‌తో పాటు ఉచిత బహుమతులు

image
భారతదేశపు ప్రముఖ అత్యుత్తమ-శ్రేణి విద్యుత్ ఉత్పత్తుల తయారీదారు, పవర్ ప్రొడక్ట్స్ సెగ్మెంట్‌లో 38 సంవత్సరాలుగా ఆకట్టుకునేలా మార్కెట్ లీడర్‌గా కొనసాగుతున్న హోండా ఇండియా పవర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (HIPP), హోండా ఫెస్టివ్ ధమాకా'ను ప్రారంభించింది. నిరూపితమైన వ్యవసాయ ఉత్పత్తుల శ్రేణిపై, ప్రత్యేకంగా వాటర్ పంప్, టిల్లర్స్, బ్రష్ కట్టర్, ఇంజన్‌లపై HIPP యొక్క ఆకర్షణీయమైన పండుగ ఆఫర్‌ల శ్రేణి అందిస్తుంది. ఈ ప్రచారాన్ని ప్రారంభించడంతో, కంపెనీ కస్టమర్-ఫస్ట్ బ్రాండ్ అనే దాని వైఖరిని పటిష్టం చేసుకుంది. దాని విస్తృత శ్రేణి  వ్యవసాయ ఉత్పత్తులకు అసమానమైన ప్రయోజనాలు మరియు రివార్డులను అందిస్తూ,  పండుగ సీజన్ ఆఫర్‌లకు మరింత ఊపును జోడిస్తుంది.
 
ఈ ప్రత్యేకమైన రిటైల్ కార్యక్రమంతో, కస్టమర్‌లు విస్తృతమైన వ్యవసాయ, నిర్మాణ పోర్ట్‌ఫోలియోల నుండి ఎంపిక చేసిన ఉత్పత్తులతో ఉచిత బహుమతులు గెలుచుకునే అవకాశాన్ని పొందుతారు. పండుగ సీజన్‌ను మరింత ఉత్సాహంగా మార్చేందుకు కంపెనీ స్క్రాచ్ కార్డ్‌లను అందిస్తోంది, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్/ఎల్‌ఈడీ టీవీ/స్మార్ట్‌వాచ్‌లు వంటి ధమాకా బహుమతులను గెలుచుకునే అవకాశాన్ని వినియోగదారులకు ఈ కార్డు ద్వారా అందిస్తోంది. ఈ కార్యక్రమం 15 అక్టోబర్ 2023 నుండి 30 నవంబర్ 2023 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ కార్యక్రమం భారతదేశ వ్యాప్తంగా అందుబాటులో ఉంటుంది. దేశవ్యాప్తంగా వ్యవసాయ-నిర్మాణ సంఘాలు మరియు ఇతర వినియోగదారులకు సహాయం చేస్తుంది.
 
హోండా ఫెస్టివ్ ధమాకా పథకాల వివరాలు:
వాటర్ పంప్: కస్టమర్‌లు స్క్రాచ్ కార్డ్‌తో పాటు ఒక LED టార్చ్/డఫిల్ బ్యాగ్‌ని ఉచిత బహుమతిగా పొందుతారు, ఈ స్క్రాచ్ కార్డ్‌తో మరో అద్భుతమైన బహుమతిని గెలుచుకునే అవకాశం ఉంటుంది.
 
బ్రష్ కట్టర్లు: బహుమతితో పాటు (డఫిల్ బ్యాగ్) కస్టమర్‌లు మరో అద్భుతమైన బహుమతిని గెలుచుకునే అవకాశాన్ని పొందుతారు.
 
టిల్లర్: టిల్లర్‌తో, వినియోగదారులు బహుమతి (బ్లూటూత్ స్పీకర్) మరియు స్క్రాచ్ కార్డ్‌ని అందుకుంటారు , మరొక అద్భుతమైన బహుమతిని గెలుచుకునే అవకాశం దీనితో లభిస్తుంది .
 
జనరల్ పర్పస్ ఇంజిన్: GPEతో, కస్టమర్‌లకు LED టార్చ్‌ని ఉచిత బహుమతిగా అందిస్తారు మరియు స్క్రాచ్ కార్డ్ తో మరొక అద్భుతమైన బహుమతిని గెలుచుకునే అవకాశం ఉంటుంది.