1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Akhilesh gifts luxury poll campaign bus to KCR

బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం- రథం సిద్ధం.. ఎవరిచ్చారంటే?

campaign bus
campaign bus
తెలంగాణ అధికార బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల కోసం సర్వం సిద్ధం చేసుకుంటోంది. ప్రత్యేకంగా తయారుచేసిన ఈ బస్సు ఇటీవలే హైదరాబాద్‌కు చేరుకుంది. ఎన్నికల ప్రచారానికి ఉపయోగించేందుకు సీఎం కేసీఆర్ కోసం ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఓ బస్సును అందించారు. 
 
ఈ ప్రచార రథం హుస్నాబాద్‌కు పయనమైనట్లు సమాచారం. ప్రచార రథాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫొటో, కారు గుర్తు, భారతదేశ పటంతో ప్రత్యేకంగా డిజైన్ చేశారు. మొత్తం గులాబీ రంగుతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. 
 
ఎన్నికల ప్రచారానికి ఉపయోగించేందుకు సీఎం కేసీఆర్ కోసం ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఓ బస్సును అందించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తేదీ (నవంబరు 30) వెల్లడైన నేపథ్యంలో సీఎం కేసీఆర్ సమరశంఖం పూరించారు. 
 
హైదరాబాదులోని తెలంగాణ భవన్‌కు వచ్చిన కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇటీవల కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు పోటీ ఇచ్చేలా బీఆర్ఎస్ మేనిఫెస్టోలోని అంశాలు ఉన్నాయి.
తర్వాతి కథనం
దసరా సెలవులకు ఇంటికొచ్చిన విద్యార్థిని గుండెపోటుతో మృతి