శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 22 నవంబరు 2019 (17:15 IST)

విజయ్‌ ఆంటోని భారీ చిత్రం ‘జ్వాల’ బ‌డ్జెట్ ఎంతో తెలుసా?

‘బిచ్చగాడు’తో తెలుగు రాష్ట్రాల్లో మంచి పాపులారిటీ పొందారు విజయ్‌ ఆంటోనీ. కంటెంట్‌ ఉన్న సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ మంచి ఆదరణ పొందుతున్నారు. ప్రస్తుతం విజయ్‌ ఆంటోనీ, అరుణ్‌ విజయ్, అక్షరా హాసన్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న తమిళ చిత్రం ‘అగ్ని సిరగుగల్‌’. ప్రస్తుతం తెలుగు, తమిళంలో రెడీ అవుతున్న క్రేజీ సినిమాల్లో ఇదొకటి. ఈ సినిమాను తెలుగులో ‘జ్వాల’ టైటిల్‌తో విడుదల చేయబోతున్నారు జవ్వాజి రామాంజనేయులు, యం.రాజశేఖర్‌. దాదాపు 25 కోట్ల రూపాయల భారీ వ్యయంతో ఈ చిత్రం తెరకెక్కనుండటం విశేషం. 
 
చిత్రీకరణ తుది దశలో ఉన్న ‘జ్వాల’ విశేషాల గురించి చిత్ర బృందం మాట్లాడుతూ – ‘‘ జ్వాల’ తొలి షెడ్యూల్‌ను చెన్నై, కోల్‌కత్తా వంటి లొకేషన్స్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించాం. ఆ తర్వాతి షెడ్యూల్‌ను మాస్కో, రష్యా వంటి దేశాల్లో కనువిందైన లొకేషన్స్‌లో షూట్‌ చేశాం. ప్రస్తుతం తుది షెడ్యూల్‌ను కజకిస్తాన్‌లో షూట్‌ చేస్తున్నాం. కజకిస్తాన్‌లో షూటింగ్‌ జరుపుకుంటున్న తొలి ఇండియన్‌ సినిమా మాదే అని చెప్పడం చాలా సంతోషంగా ఉంది.
 
విజువల్‌ ఫీస్ట్‌గా మా సినిమా ఉండబోతోంది. ఈ సినిమాలో యాక్షన్‌ సన్నివేశాలు యాక్షన్‌ మూవీ లవర్స్‌ విపరీతంగా ఎంజాయ్‌ చేస్తారని అనుకుంటున్నాం. ఇంటర్నేషనల్‌ స్థాయిలో ఈ సినిమా ఉండబోతోంది అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. సినిమా అవుట్‌పుట్‌ చూస్తుంటే చాలా సంతృప్తికరంగా ఉంది. దర్శకుడు నవీన్‌ అద్భుతమైన విజన్‌తో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను రూపొందిస్తున్నారు. అతి త్వరలోనే ట్రైలర్, ఆడియో, చిత్ర రిలీజ్‌ వివరాలు తెలియజేస్తాం’’ అని తెలిపింది.