మళ్లీ సినిమాల్లోకి వస్తోన్న భావన..

Bhavana
సెల్వి| Last Updated: శుక్రవారం, 22 నవంబరు 2019 (11:33 IST)
2017లో భావన కిడ్నాప్ ఎపిసోడ్.. దక్షిణాది ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపింది. ఆ తర్వాత పెళ్లి చేసుకున్న ఈ కేరళ బ్యూటీ.. ఇప్పుడు మళ్లీ రెట్టించిన ఉత్సాహంతో ప్రేక్షకుల్ని అలరిస్తోంది. తాజాగా భావన రెండు కొత్త సినిమాల్లో నటిస్తోంది. ఈమె నటించే ఇన్‌స్పెక్ట్రర్ విక్రమ్, భజరంగి 2 నిర్మాణ దశలో ఉన్నాయి. 2002లో మలయాళంలో నమ్మల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన భావన, ఆ తర్వాత తమిళ, కన్నడ, తెలుగు సినిమాల్లో నటించి మెప్పించింది.

హీరోయిన్ భావన కిడ్నాప్ కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కారులో వెళ్తున్న భావనను కిడ్నాప్ చేయడం దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో మొదటి నుంచి మలయాళం స్టార్ హీరో దిలీప్ పేరు వినిపిస్తోంది. నిందితులను పురమాయించి దిలీప్ ఈ పని చేయించారని వార్తలు కూడా వచ్చాయి.దీనిపై మరింత చదవండి :