సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 21 నవంబరు 2019 (14:10 IST)

అమెజాన్ ప్రైమ్‌లో మెగాస్టార్ ‘సైరా నరసింహారెడ్డి’

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన హిస్టారికల్ బ్లాక్ బస్టర్ మూవీ ‘సైరా నరసింహారెడ్డి’. తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ‌నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార, తమన్నా హీరోయిన్స్ గా నటించారు.
 
కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా నేటితో సక్సెఫుల్‌గా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇకపోతే ఈ సినిమా ఈరోజు నుండి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రముఖ డిజిటల్ మాద్యమం అమెజాన్ ప్రైమ్ వీక్షకులను అలరించనుంది. కాగా హిందీ వెర్షన్ మాత్రం ఈ నెల 28 నుండి అందుబాటులోకి రానున్నట్లు ఆ సంస్థ  తమ సోషల్ మీడియా అకౌంట్స్‌లో ఒక పోస్టు పెట్టడం జరిగింది.