శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వాసుదేవన్ ఆరంబాకం
Last Modified: గురువారం, 7 మార్చి 2019 (19:55 IST)

నన్ను ఫాలో కావద్దంటున్న విజయ్... ఎందుకు?

తమిళనాట రజినీ తరువాత అంతటి అభిమాన గణాన్ని సొంతం చేసుకున్న ఇళయ దళపతి విజయ్‌ని ఫ్యాన్స్‌ విపరీతంగా ఆరాధిస్తూంటారు. అయితే దానికీ హద్దు ఉండాలంటూ ఆయన ఇటీవల తన అభిమానులు ఇద్దరికి సూచించారట. ప్రస్తుతం తమిళ బాక్సాఫీస్‌ కింగ్‌గా దూసుకుపోతూ... తన సినిమాలతో ఈజీగా వంద కోట్లను కలెక్ట్‌ చేసేస్తూ.. రికార్డులు సృష్టిస్తున్న ఈ ప్రస్తుతం తన తదుపరి చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.
 
కాగా ఇటీవలి కాలంలో... విజయ్‌ తన మూవీ షూటింగ్‌ కోసం వెళ్తుండగా.. ఇద్దరు అభిమానులు ఆయనను వెంబడించారట. విజయ్ కారు డ్రైవర్‌ వేగాన్ని పెంచినప్పటికీ.. అభిమానులు మాత్రం వదలకుండా అంతే వేగంతో వెనకే వెళ్లడం జరిగిందట. ఈ విషయాన్ని గమనించిన విజయ్‌.. కారు వేగాన్ని తగ్గించమని చెప్పి.. తన అభిమానులతో ‘ఇంత వేగంగా వెళ్లడం, ఇలా ఫాలో అవ్వడం అంత మంచి కాదు. ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. నన్ను ఇలా ఫాలో కావొద్దంటూ’ సూచించాడట. 
 
ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు , వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.