శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 16 జులై 2020 (14:32 IST)

సౌత్ లోనే నెం.1 హీరోగా విజయ్ దేవరకొండ, ఈ రికార్డే సాక్ష్యం..!

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండకు యూత్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అనతి కాలంలోనే తన స్టైల్, డిఫరెంట్ అటిట్యూడ్‌తో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా విజయ్‌కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.
 
రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త రికార్డు క్రియేట్ చేశాడు. 8 మిలియన్ల ఫాలోవర్స్‌ను సంపాదించుకొని సౌత్ ఇండియాలోనే ఫస్ట్ హీరోగా నిలిచాడు. 80 లక్షల మార్కు దాటడంతో విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. విజయ్‌కు ఇంతమంది పాలోవర్స్ ఉండటానికి రీజన్ ఆయనను దేశవ్యాప్తంగా అందరూ అభిమానించటమే.
 
విజయ్ నటించిన తెలుగు సినిమాలు అర్జున్ రెడ్డి, గీత గోవిందం, డియర్ కామ్రేడ్ హిందీలో డబ్ కావడంతో అక్కడ కూడా ఫ్యాన్స్ అయ్యారు. ఇక ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో విజయ్ చేస్తున్న సినిమా ప్యాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతుంది. ఈ సినిమాతో డైరెక్ట్‌గా బాలీవుడ్లో అడుగుపెట్టబోతున్నాడు విజయ్ దేవరకొండ.