శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By కుమార్ దళవాయి
Last Modified: శుక్రవారం, 31 మే 2019 (19:56 IST)

మహేష్ బాబు చిత్రంలో విజయశాంతి... స్టార్ తిరుగుతుందా?

ఒకప్పటి స్టార్ నటి విజయశాంతి సినిమాలకు గుడ్ బై చెప్పి చాలా కాలమైంది. రాజకీయాల్లో బిజీ బిజీగా ఉన్న విజయశాంతి ప్రస్తుతం మళ్లీ ముఖానికి రంగేయబోతున్నారు. దాదాపు 13 ఏళ్ల విరామం తరువాత మహేష్ బాబు నటించే కొత్త సినిమా 'సరిలేరు నీకెవ్వరు'తో రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారు. 
 
విజయశాంతి సూపర్ స్టార్ కృష్ణతో 'కిలాడి కృష్ణ' సినిమా ద్వారా వెండితెరకు పరిచయమై అనేక హిట్ సినిమాల్లో నటించి మంచిపేరు తెచ్చుకున్నారు. దాదాపు 180 సినిమాల్లో నటించిన విజయశాంతి సరిగ్గా 13 ఏళ్ల తర్వాత కృష్ణ కొడుకు మహేష్ బాబు సినిమాతో రీఎంట్రీ ఇవ్వడం విశేషం. ఇకపోతే ఈ చిత్రంలో జగపతిబాబు కూడా ఒక కీలక పాత్ర చేయనున్నారు.