విజయశాంతి అంత కావాలంటోందా?
విజయశాంతి... నిన్నటితరం కథానాయికగా వెండితెరపై ఒక వెలుగు వెలిగుతూ.... అగ్ర కథానాయకులందరి సరసన నటించి అనేక విజయాలను సొంతం చేసుకున్న మీదట అక్కడ నుండి మళ్లీ లేడీ ఓరియంటెడ్ సినిమాల వైపుకి తిరిగి ఆ రంగంలోనూ విజయం సాధించేసిన విషయం అందరికీ తెలిసిందే.
కాగా... ఆ తర్వాతి కాలంలో రాజకీయాలకి ప్రాధాన్యతనివ్వడంతో సినిమాలను, సినీ రంగాన్ని దాదాపు దూరం పెట్టేసారనే చెప్పాలి. అలా చాలం కాలంగా నటనకి దూరమైన విజయశాంతిని తిరిగి సినీ పరిశ్రమలోకి... రీ ఎంట్రీ ఇప్పించేందుకు అనిల్ రావిపూడి ప్రయత్నించి సక్సెస్ అయినట్లుగా వార్తలు గుప్పుమంటున్నాయి.
వివరాలలోకి వెళ్తే... మహేశ్ బాబు కెరీర్‌లోని 26వ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం విజయశాంతి అయితేనే బాగుంటారని భావించిన ఆయన ఆమెను సంప్రదించి ఒప్పించడం జరిగిందనే వార్తలు గుప్పుమంటున్న నేపథ్యంలో... విజయశాంతికి గల క్రేజ్ తెలిసిందే గనుక, ఆమెకి పారితోషికంగా ఎంత ముడుతుందనే మాట ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
కాగా... ఈ సినిమా కోసం ఆవిడ 2 కోట్లు అడిగారనీ, కోటి నుంచి కోటిన్నర ఆమెకు ముట్టనుందని ఫిల్మ్ నగర్‌లో చెప్పుకుంటున్నారు. అంటే దాదాపు ఒక స్టార్ హీరోయిన్‌కి అందేంత పారితోషికం విజయశాంతికి ఈ రీఎంట్రీ ద్వారా ముట్టబోతోందన్న మాట. ఎంతైనా లేడీ అమితాబ్ రూటే వేరుగా మరి.