సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By మోహన్
Last Updated : బుధవారం, 24 ఏప్రియల్ 2019 (18:55 IST)

వెబ్‌సిరీస్‌లో టాలీవుడ్ మన్మథుడి భార్య..?

టాలీవుడ్ కింగ్ నాగార్జున భార్య అక్కినేని అమల చాలా గ్యాప్ తర్వాత ముఖానికి మేకప్ వేసుకున్నారు. నిత్యం బ్లూక్రాస్ పనుల్లో బిజీగా ఉండే అమల, జీ 5 ఆప్ వారు నిర్మించిన 'హై ప్రిస్ట్స్‌' అనే వెబ్ సిరీస్‌లో లీడ్ రోల్ చేశారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ వెబ్ సిరీస్‌ని పుష్ప డైరెక్ట్ చేశారు. బ్రహ్మాజీ, వరలక్ష్మీ శరత్ కుమార్, సునైనా, బిగ్ బాస్ 2 ఫేమ్ నందిత, కిషోర్ తదితరులు ఇందులో నటించారు. 
 
కాన్సెప్ట్ నచ్చడంతో ఈ వెబ్ సిరీస్‌లో నటించినట్లు అమల చెప్పారు. ఇందులో ఆమె మణి అనే పాత్రలో కనిపించనున్నారు. అయితే గతంలో తాము నిర్మించిన పలు వెబ్ సిరీస్‌లు సక్సెస్ అయినట్లే, పై ప్రిస్ట్స్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని జీ 5 వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ ఏప్రిల్ 25 నుండి జీ 5 యాప్‌లో స్ట్రీమింగ్ కానుంది.