ఆ ముగ్గురిని వదలని విక్రమ్ కుమార్... ఇంతకీ ఎవరా ముగ్గురు?
మనం దర్శకుడు '24' సినిమాతో కొత్తగా ఆలోచించే దర్శకుడిగా పేరు తెచ్చుకున్న విక్రమ్ కె.కుమార్‌కు.. ముగ్గురు నటులంటే ఇష్టమట. వారిన వదులుకోనని..వారితో తదుపరి చిత్రాలు చేస్తానని ప్రకటించేశాడు. అందులో నిత్యమీనన్, సమంతలు ఉన్నారు. ఇద్దరూ నటనాపరంగా బాగా ఎదిగినవారు. వారుంటే చాలు.. పాత్రకు న్యాయం జరుగుతుందట.
అలాగే అజయ్.. 'ఇష్క్'తో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం.. అలాగే కొనసాగుతుంది. అందులో పాజిటివ్ విలన్‌గా నటించాడు. అప్పటినుంచి బెస్ట్‌ఫ్రెండ్ అయ్యాడు. '24'లో ఆత్రేయ పాత్రకు అనుచరుడుగా వున్నాడు.. ఆ తర్వాత తాను తీయబోయే చిత్రాల్లో అజయ్‌నూ వదులుకోనని వెల్లడించాడు. సో.. ముగ్గురు నటులు జాక్‌ఫాట్ కొట్టేశారన్నమాట.