గురువారం, 19 జూన్ 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 29 జనవరి 2017 (12:10 IST)

మోహన్ లాల్ సినిమాతో కలిసి విశాల్.. విలన్‌గా అవతారం..

తమిళ హీరో విశాల్ విలన్ అవతారం ఎత్తనున్నాడు. విశాల్ విలనిజం చూపించేందుకు రెడీ అయ్యాడు. అది కూడా మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ సినిమాలో కావడం విశేషం. ఉన్ని కృష్ణన్ దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా ఓ చిత్రం

తమిళ హీరో విశాల్ విలన్ అవతారం ఎత్తనున్నాడు. విశాల్ విలనిజం చూపించేందుకు రెడీ అయ్యాడు. అది కూడా మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ సినిమాలో కావడం విశేషం. ఉన్ని కృష్ణన్ దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని రాక్ లైన్ వెంకటేశ్ నిర్మించనున్నారు. ఈ చిత్రంలో విశాల్ విలన్‌గా నటించబోతున్నాడు. 
 
ఈ చిత్రం మలయాళం, తమిళ్, తెలుగులోనూ రిలీజ్ కానుంది. ఈ మధ్య మోహన్ లాల్ మలయాళ మార్కెట్‌తో పాటుగా టాలీవుడ్, కోలీవుడ్ మార్కెట్లపై కన్నేశాడు. ఇందుకు ఆయా పరిశ్రమలోని యంగ్ హీరోలతో సినిమాలు చేస్తూ వెలుగుతున్నాడు. తెలుగులో ఎన్‌టీఆర్‌తో కలసి జనతా గ్యారేజ్ చేశాడు. అది బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ఇప్పుడు విశాల్ తన సినిమాలో విలన్‌గా తీసుకొన్నాడు.