suvichar
✕

మైగ్రేన్‌తో ఇబ్బంది పడుతున్న వరుణ్ భార్య రితిక

Written By సెల్వి
Updated: సోమవారం, 23 అక్టోబరు 2023 (10:12 IST)
సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్న నటుడు వరుణ్ సందేశ్‌. ప్రస్తుతం అతడికి అవకాశాలు రాక వెండితెరకు దూరంగా ఉంటున్నాడు. అయితే, సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్‌గా ఉంటాడు. 
 
హీరో వరుణ్ భార్య వితికా షేరూ కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్. ఆమె ఓ యూట్యూబ్ ఛానల్ కూడా నిర్వహిస్తోంది. సినిమాలకు దూరంగా ఉంటున్నా ఈ జంట ఆ మధ్య బిగ్‌బాస్‌లో కనిపించి అభిమానులను అలరించింది. ప్రస్తుతం ఆమె అనారోగ్యం బారిన పడినట్లు వెల్లడించింది.  తాను కొన్ని రోజులుగా స్పాండిలైటిస్, మైగ్రేన్‌తో బాధపడుతున్నట్టు ఆమె చెప్పుకొచ్చింది. 
 
దీంతో, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామంటూ కామెంట్స్ పెడుతున్నారు. 
 
మైగ్రేన్‌తో విపరీతమైన తలనొప్పి, వెన్నునొప్పి కలుగుతున్నాయని, ఫలితంగా ఏ పనీ చేయలేకపోతున్నానని పేర్కొంది. స్పాండిలైటిస్‌కు ఫిజియోథెరపీ చేయించుకుంటున్నట్టు తెలిపింది. నీడ్లింగ్ కూడా చేయించుకున్నట్లు తెలిపింది. 
 
తన బాధను అభిమానులతో పంచుకుంటూ కాస్త రిలీఫ్ పొందుతున్నానని వెల్లడించింది. 

అన్నీ చూడండి

కుల్గాంలో ఎన్‌కౌంటర్... లష్కర్ కమాండర్ లతీఫ్ భట్ హతం

తెలుగు రాష్ట్రాలలో నవంబర్ 18, 2026న వాతావరణం ఎలా వుంటుందంటే..?

సీఎంకి శుభలేక ఇస్తే చెట్టపట్టాల్ అంటారా? మీ మెదడు ఇంకా మోకాళ్లలో ఎందుకుందో?: వైఎస్ షర్మిల ఆగ్రహం

మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసిన ఏపీ సీఎం చంద్రబాబు.. ఆర్థిక సాయం కోసం విజ్ఞప్తి

AP Municipal Elections: ఏపీ మున్సిపల్ ఎన్నికలు: 7,508 నామినేషన్లు దాఖలు

అన్నీ చూడండి

మనం తాగుతున్న పాలు, పెరుగు, పన్నీర్ ఆరోగ్యానికి ఏం చేస్తున్నాయి?

ఏ కూరగాయలు ఏ శరీర అవయవానికి మేలు చేస్తాయి?

ఈ వ్యాధిగ్రస్తులకు కిడ్నీ జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ, ఎవరు?

ప్రాణాంతక యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ ముప్పును తగ్గించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments