సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 17 మే 2017 (09:51 IST)

వాన్నా క్రై బాధితుల్లో పవన్ కళ్యాణ్.. ట్విట్టర్ ఖాతా హ్యాక్

ప్రపంచాన్ని వణికించిన సైబర్ అటాక్ వాన్నా క్రై బాధితుల్లో జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్ చేరాడు. ఆయన ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయింది. భారత దేశంలో అతిపెద్ద సంఖ్యలో ఫాలోవర్లు కలిగిన పవన్ కల్యాణ్ ట్వ

ప్రపంచాన్ని వణికించిన సైబర్ అటాక్ వాన్నా క్రై బాధితుల్లో జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్ చేరాడు. ఆయన ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయింది. భారత దేశంలో అతిపెద్ద సంఖ్యలో ఫాలోవర్లు కలిగిన పవన్ కల్యాణ్ ట్విట్టర్ అకౌంట్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. 
 
హైదరాబాద్‌లో 'దద్దరిల్లిన ధర్నాచౌక్' అంశంపై స్పందించడానికి ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేస్తుంటే పాస్‌వర్డ్ ఛేంజ్ అయినట్లు మెసేజ్ డిస్‌ప్లే అయిందని పవన్ సన్నిహితుల నుంచి అందిన సమాచారం. 
 
మూడు రోజుల క్రితమే ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తే అవలేదని, ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్ అయి ఉండొచ్చని పవన్ భావించాడని అతడి సన్నిహితులు చెబుతున్నారు. అయితే చివరిగా తన అకౌంట్ హ్యాక్ అయినట్లు పవన్ కల్యాణ్ గుర్తించారని తెలిసింది. 
 
కాగా, పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ఖాతాను 18 లక్షల మంది ఫాలో అవుతున్నారు. ట్విట్టర్‌లో అకౌంట్ ఓపెన్ చేసిన కొద్దిసేపట్లోనే లక్షల మంది ఫాలోవర్లను సంపాదించిన రికార్డు పవన్ కల్యాణ్ పేరుమీదే ఉండటం గమనార్హం.