గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 28 నవంబరు 2022 (11:47 IST)

అట్టహాసంగా హాస్య నటుడు అలీ కుమార్తె వివాహం

ali daughter marraige
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ సినీ హాస్య నటుడు అలీ పెద్ద కుమార్తె ఫాతిమా వివాహం అట్టహాసంగా జరిగింది. హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేట్ కన్వెన్షన్ సెంటర్ హాలులో జరిగిన ఈ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి దంపతులు, అక్కినేని నాగార్జున దంపతులు, ఏపీ మంత్రి, సినీ నటి రోజాతో పాటు అనేక మంది సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇపుడు ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ali daughter marraige
 
కాగా, ఇటీవలే ఏపీ ప్రభుత్వం హాస్య నటుటు అలీని ఏపీ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా నియమించిన విషయం తెల్సిందే. దీన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన కుమార్తెకు బహుమతిగా ఇచ్చారని అలీ తెలిపిన విషయం తెల్సిందే.