శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 25 జనవరి 2017 (12:46 IST)

సన్నీలియోన్ అర్బాజ్ ఖాన్ కోసం.. చెమటలు కక్కేలా ఎక్సర్ సైజ్ చేస్తోందట... (Video)

షారూఖ్ ఖాన్‌తో రయీస్ సినిమాలో ఐటమ్ సాంగ్ చేసిన అందాల సుందరి సన్నీ లియోన్.. ప్రస్తుతం తన బాడీ షేప్‌ను కాపాడుకునేందుకు ఎంతో కష్టపడుతోంది. సౌందర్య పోషణతో పాటూ శరీరసౌష్టవం కోసం గట్టి కసరత్తులే చేస్తోంది.

షారూఖ్ ఖాన్‌తో రయీస్ సినిమాలో ఐటమ్ సాంగ్ చేసిన అందాల సుందరి సన్నీ లియోన్.. ప్రస్తుతం తన బాడీ షేప్‌ను కాపాడుకునేందుకు ఎంతో కష్టపడుతోంది.  సౌందర్య పోషణతో పాటూ శరీరసౌష్టవం కోసం గట్టి కసరత్తులే చేస్తోంది. స్వతహాగా ఫిట్నెస్ ఫ్రీక్ అయిన సన్నీలియోన్ టైమ్ దొరికితే చాలు జిమ్‌లో చెమటలు కక్కేలా ఎక్సర్‌సైజ్ చేస్తోంది. ఇందుకు సంబంధించి తాజాగా ఓ వీడియో విడుదలైంది. ఈ వీడియోలో అమ్మడి వర్కౌట్ చూస్తే...సన్నీ తన అందాలను కాపాడుకునేందుకు ఈ రేంజ్‌లో కష్టపడుతుందా అనిపించకమానదు.
 
బలమైన తాళ్లతో విన్యాసాలు చేస్తున్న సన్నీ... రకరకాల కసరత్తులతో తన అందాలకు మరింత పదును పెడుతోంది. మరోవైపు కింగ్ ఖాన్ షారుఖ్ 'రయీస్' సహా పలు చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్ చేస్తున్న సన్నీ సూపర్ బిజీగా ఉంది. సినిమాల్లో బిజీ అవుతున్న కారణంగానే, తన అందాలను మరింత మెరుగు పరచుకోవడానికి సన్నీ వర్కౌట్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేగాకుండా 'తేరా ఇంతెజార్' అనే చిత్రంలో లీడ్ రోల్‌లో నటిస్తున్న సన్నీ... సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. ఈ సినిమాలో అందంగా కనిపించేందుకు సన్నీ బాగా కష్టపడుతోందని బిటౌన్‌ టాక్.