శనివారం, 29 మార్చి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : బుధవారం, 26 మార్చి 2025 (19:59 IST)

Nitin: సోలోడేట్ లోనే రాబిన్‌హుడ్ అనుకున్నాం, కానీ పోటీ తప్పదనే రావాల్సివచ్చింది : చిత్ర టీమ్

Nithin, Venky Kudumula, Ravi
Nithin, Venky Kudumula, Ravi
నితిన్, శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ సినిమాకు 95% పాత రేట్లే వున్నాయి. ఐదు శాతం అది కూడా కొన్ని మాల్స్ లో మాత్రమే స్మాల్ చేంజ్ వుంటుంది. అది కూడా ఎఫర్టబుల్ గానే ఉంటుంది. టికెట్ రేట్ వల్ల ఈ సినిమా చూడలేదనే ఫీలింగు ఎక్కడ ఉండదు అని నిర్మాత మైత్రీమూవీస్ రవి అన్నారు.
 
వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ హై బడ్జెట్ తో నిర్మించారు. రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించారు. ఆస్ట్రేలియా డైనమిక్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక అతిధి పాత్రలో నటించారు. ఈ సినిమా మార్చి 28న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా  చిత్ర టీమ్ పలు విషయాలు తెలిపారు.
 
సోలో కాకుండా నాలుగు  సినిమాలతో పోటీగా నితిన్ సినిమా తీసుకురావడంపై నిర్మాత రవి స్పందిస్తూ.. 
ఈ రోజుల్లో ఉన్న పోటీ ప్రపంచంలో సోలో ఆశించకూడదు. మేము వస్తున్నప్పుడు ఒకటే సినిమా అనుకున్నాం. కానీ రెండు డబ్బింగ్ సినిమాలు వచ్చాయి. ఇది మేము ముందుగా ఊహించలేదు. ఎవరి సినిమాలు. ఎవరి డేట్లు, ఎవరి కమిట్మెంట్లు వాళ్లకు ఉంటాయి. మనం చేస్తున్నప్పుడే సోలోడేట్ అని ఫిక్స్ అవ్వకుండా పోటీ తప్పదనే మైండ్ సెట్ తోనే దిగాలని భావిస్తాను.
 
- అలాగే రంగస్థలం సమ్మర్ లో వచ్చిన ఫస్ట్ సినిమా. ఈ సినిమా కూడా సమ్మర్ లో వస్తున్న ఫస్ట్. సినిమాకి  డెఫినెట్ గా  ఆ అడ్వాంటేజ్ ఉంటుంది. పరీక్షలు ఫినిష్ అయ్యాయి. యూత్ కూడా ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తున్నారు. రంగస్థలం ఎలాంటి మ్యాజిక్ చేసిందో ఈ సినిమా కూడా అలాంటి మ్యాజిక్ చేయాలని కోరుకుంటున్నాను.
 
నితిన్ ఇందులో క్యారెక్టర్ గురించి చెబుతూ.. 
- నా క్యారెక్టర్ ఇందులో వెరీ బిగ్ మానిప్లేటర్. చాలా స్మార్ట్ మైండ్. ఫిజికల్ స్ట్రెంత్ కంటే మెంటల్ స్ట్రెంత్ ఎక్కువగా ఉండే క్యారెక్టర్. ఫస్ట్ టైం ఇలాంటి క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. క్లైమాక్స్ లో నా క్యారెక్టర్ రౌండప్, వచ్చే ట్విస్టులు, షాకులు చాలా ఫ్రెష్ గా ఉంటాయి. భీష్మ సినిమాలో కంటే నా క్యారెక్టర్ వెరీ స్ట్రీట్ స్మార్ట్ గా ఉంటుంది. వెరీ ఇంటలెక్చువల్ క్యారెక్టర్.
 
సెన్సార్ టాక్ గురించి దర్శకుడు మాట్లాడుతూ..
- సినిమా అంతా షుగర్ కోట్ లాగా ఫన్ కొటెడ్ గా ఉంటుంది. కానీ సినిమాలలో సోల్ ఎమోషనే. ఆ ఎమోషన్ సీక్వెన్స్ చాలా బాగా వర్కౌట్ అయింది. అది మీరు బిగ్ స్క్రీన్ లోనే చూడాలి. ఇప్పటివరకు చూసినవారు చాలా అద్భుతంగా ఉందని చెప్పారు