శనివారం, 29 మార్చి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : బుధవారం, 26 మార్చి 2025 (09:50 IST)

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

Narne Nithin,  Sangeet Shobhan, Ram Nithin
Narne Nithin, Sangeet Shobhan, Ram Nithin
బ్లాక్ బస్టర్ చిత్రం 'మ్యాడ్'కి సీక్వెల్ గా రూపొందిన 'మ్యాడ్ స్క్వేర్' కోసం సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. సూర్యదేవర నాగవంశీ సమర్పకులు. మార్చి 28న విడుదల కానున్న 'మ్యాడ్ స్క్వేర్'పై భారీ అంచనాలు ఉన్నాయి. 
 
ఈ సినిమా కథ గురించి నార్నే నితిన్ మాట్లాడుతూ, మా బావ ఎన్.టి.ఆర్. ప్రతికథను వింటారు. నేను కథ చెప్పినతర్వాత ఆయనకు నచ్చితే ముందుకు వెళతాను. మ్యాడ్ కథ విని చాలా మెస్మరైజింగ్ గా వుందని కితాబిచ్చారు. అయితే ఇందులో లాజిక్ లు గురించి ఆలోచించకూడదు. కథనం ఎలా వెళుతుందో చూడాలి. కథంటూ ప్రత్యేకంగా వుండదు అన్నారు.
 
మ్యాడ్ గ్యాంగ్ గా ముగ్గురు కలిసి నటించారు. సీక్వెల్ చేశారు. ఇలానే ఇతర సినిమాల్లో చేసే అవకాశం వుందా? అంటే.. అసలు మాకు ఆ ఆలోచనలేదు. విడివిడిగా తాము సినిమాల్లో బిజీగా వున్నామంటూ నార్నె నితిన్, రామ్ నితిన్ అన్నారు. ఉగాది తన కొత్త సినిమా సెట్ పైకి వెళ్లనుందని నార్నే నితిన్ అన్నాడు. ఇక సంగీత్ శోభన్ మాత్రం, తనకు వెబ్ సిరీస్ వస్తున్నా, సినిమాలు చేయాలనే పట్టుదలతో మంచి కథలతో సినిమాలు చేస్తున్నా అన్నారు. 
 
సంతోష్ శోభన్ కు తమ్ముడయిన సంగీత్ శోభన్ అన్నకంటే బిజీగా వున్నాడు. యూత్ లో సక్సెస్ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. తన అన్న కూడా నా సినిమా కథలు వింటాడు. సూచనలు చేస్తుంటాడు. మా ఇద్దరి మధ్య ఎటువంటి ఇగోస్ లేవని  పేర్కొన్నాడు.