సోమవారం, 3 మార్చి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 2 మార్చి 2025 (14:02 IST)

ఒకరోజు ముందుగానే నవ్వులు పంచనున్న 'మ్యాడ్ స్క్వేర్' చిత్రం

mad square movie
బ్లాక్ బస్టర్ చిత్రం 'మ్యాడ్'కి సీక్వెల్‌గా రూపొందుతోన్న 'మ్యాడ్ స్క్వేర్' కోసం సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేవలం ప్రకటనతోనే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఇక ఇటీవల విడుదలైన టీజర్ విశేషంగా ఆకట్టుకొని, ఆ అంచనాలను రెట్టింపు చేసింది. 'మ్యాడ్ స్క్వేర్' బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించడం ఖాయమనే అభిప్రాయం అందరిలో నెలకొంది.
 
'మ్యాడ్ స్క్వేర్' చిత్రం మార్చి 29 శనివారం నాడు విడుదల కావాల్సి ఉండగా, డిస్ట్రిబ్యూటర్ల కోరిక మేరకు ఒక రోజు ముందుగా మార్చి 28 శుక్రవారం నాడు విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించారు. తాజా నిర్ణయంతో 'మ్యాడ్ స్క్వేర్' చిత్రం మొదటి వారాంతంలో భారీ వసూళ్ళను రాబడుతుందని అనడంలో సందేహం లేదు.
 
'మ్యాడ్ స్క్వేర్' సినిమాని ఒకరోజు ముందుగా విడుదల చేస్తుండటంపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్పందిస్తూ, "మా పంపిణీదారుల అభ్యర్థన మరియు మద్దతుతో 'మ్యాడ్ స్క్వేర్' చిత్రం ఒక రోజు ముందుగా మార్చి 28వ తేదీన వస్తుంది. చివరి నిమిషంలో విడుదల తేదీ మార్చాలనే ఉద్దేశం ఎప్పుడూ లేదు. మార్చి 29న అమావాస్య కావడంతో, మా పంపిణీదారులు విడుదలను ముందుకు తీసుకెళ్లడం ఉత్తమమని అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయం పట్ల మేము కూడా సంతోషంగా ఉన్నాము. 'మ్యాడ్ స్క్వేర్'తో పాటు మార్చి 28న విడుదల కానున్న 'రాబిన్‌హుడ్' చితం కూడా ఘన విజయం సాధించాలని మనస్ఫూరిగా కోరుకుంటున్నాను. ఈ వేసవికి నవ్వుల పండుగ రాబోతుంది." అన్నారు.
 
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. 'మ్యాడ్ స్క్వేర్' కూడా 'టిల్లు స్క్వేర్' బాటలో పయనించి, మరో ఘన విజయాన్ని అందించడానికి సిద్ధమవుతోంది. పైగా 'లక్కీ భాస్కర్', 'డాకు మహారాజ్' వంటి ఘన విజయాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో 'మ్యాడ్ స్క్వేర్'తో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్‌ను సాధిస్తామనే నమ్మకంతో సితార ఉంది.
 
శ్రీకర స్టూడియోస్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. మ్యాడ్ సినిమాలో తనదైన ప్రత్యేకశైలి హాస్య సన్నివేశాలు, ఆకర్షణీయమైన కథనంతో ఎంతో పేరు తెచ్చుకున్న దర్శకుడు కళ్యాణ్ శంకర్, ఈ సీక్వెల్‌తో మరోసారి నవ్వుల విందుని అందించబోతున్నారు. 
 
మొదటి భాగంలో తమ అల్లరితో నవ్వులు పూయించిన నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ మరియు విష్ణు ఓఐ (లడ్డు).. 'మ్యాడ్ స్క్వేర్'లో అంతకుమించిన అల్లరి చేయబోతున్నారు. రెబా జాన్ ప్రత్యేక గీతంలో సందడి చేయనున్నారు. కె.వి. అనుదీప్, ప్రియాంక జవాల్కర్ తదితరులు కీలక పాత్రలలో అలరించనున్నారు.
 
'మ్యాడ్ స్క్వేర్' చిత్రానికి సంగీత సంచలనం భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయి. ప్రముఖ ఛాయగ్రాహకుడు శామ్‌దత్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. 
 
భారీ అంచనాల నడుమ 2025, మార్చి 28న థియేటర్లలో అడుగుపెట్టనున్న 'మ్యాడ్ స్క్వేర్' చిత్రం, ఆ అంచనాలకు తగ్గట్టుగానే భారీ ఓపెనింగ్స్‌ ను రాబడుతుంది ఆనందంలో సందేహం లేదు. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని విశేషాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
 
చిత్రం: మ్యాడ్ స్క్వేర్
విడుదల తేదీ: మార్చి 29, 2025
బ్యానర్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ & ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకరా స్టూడియోస్
 
తారాగణం: సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్‌, విష్ణు ఓఐ
దర్శకత్వం: కళ్యాణ్ శంకర్
సమర్పణ: సూర్యదేవర నాగ వంశీ
నిర్మాతలు: హారిక సూర్యదేవర, సాయి సౌజన్య
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
ఛాయాగ్రహణం: శామ్‌దత్ ఐఎస్సీ 
కూర్పు: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీ నాగేంద్ర తంగాల
అదనపు స్క్రీన్ ప్లే: ప్రణయ్ రావు తక్కళ్లపల్లి
కళ: పెనుమర్తి ప్రసాద్ ఎంఎఫ్ఏ 
ఫైట్ మాస్టర్: కరుణాకర్
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్