బుధవారం, 26 మార్చి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : మంగళవారం, 25 మార్చి 2025 (17:18 IST)

Srileela: రష్మిక డేట్స్ కుదరక రాబిన్‌హుడ్ చేయలేదు, కాలేజీ రూల్స్ ప్రకారం వెళుతున్నా : శ్రీలీల

Srileela
Srileela
హీరో నితిన్ హైలీ యాంటిసిపేటెడ్ హీస్ట్ కామెడీ ఎంటర్ టైనర్ రాబిన్‌హుడ్. శ్రీలీల కథానాయికగా నటించింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ హై బడ్జెట్ తో నిర్మించారు. ఈ చిత్రంలో నట కిరీటి రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించారు. ఆస్ట్రేలియా డైనమిక్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక అతిధి పాత్రలో నటించారు.

ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. ఈ సినిమా మార్చి 28న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా హీరోయిన్ శ్రీలీల విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.
 
Srileela
Srileela
రాబిన్‌హుడ్ లో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? 
-ఇందులో నా పాత్ర పేరు నీరా వాసుదేవ్.  ఫారిన్ నుంచి ఇండియా వచ్చిన అమ్మాయిగా కనిపిస్తాను. తను తన సొంత ప్రపంచంలో ఉంటుంది. ఈ ప్రపంచమంతా తన చుట్టూనే ఉంటుందని అనుకుంటుంది. ఈ క్యారెక్టర్ చాలా క్యూట్ అండ్ బబ్లీగా ఉంటుంది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది.
 
మొదట ఈ సినిమాకి రష్మిక గారిని అనుకున్నారు కదా.. తర్వాత మీరు ఈ ప్రాజెక్టులోకి ఎలా వచ్చారు?
-వరుస రిలీజ్ తర్వాత నా ఎడ్యుకేషన్ కోసం కొంత గ్యాప్ తీసుకోవాలని అనుకున్నాను. అలాంటి సమయంలో వెంకి గారు కాల్ చేశారు. నిజానికి రష్మిక గారికి చాలా నచ్చిన క్యారెక్టర్ ఇది. డేట్స్ కుదరకపోవడం వల్ల చేయలేదు. పుష్ప షూటింగ్లో కలిసినప్పుడు ఆల్ ది బెస్ట్ చెప్పారు. నాకు కూడా చాలా నచ్చి చేశాను.  
 
నితిన్ గారితో రెండోసారి కలిసి వర్క్ చేయడం ఎలా అనిపించింది?
-నితిన్ గారితో వర్క్ చేయడం చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆయన ఫ్యామిలీ పర్సన్ లాగా ఉంటారు. సినిమాపై టీమంతా చాలా  కాన్ఫిడెంట్ గా ఉన్నాం. మాకు చాలా టైం దొరికింది. చాలా క్వాలిటీతో ఈ సినిమాని ఆడియన్స్ ముసుకు తీసుకొస్తున్నాం. సినిమాని ఆడియన్స్  మంచి హిట్ చేస్తారనే నమ్మకం ఉంది. ఈ సినిమాతో నితిన్ గారు నాది హిట్ పెయిర్ అవుతుందనే నమ్మకం ఉంది.
 
వెన్నెల కిషోర్ గారు, రాజేంద్రప్రసాద్ గారు ట్రాక్ గురించి?
-వెన్నెల కిషోర్ గారు రాజేంద్రప్రసాద్ గారి ట్రాక్ షూట్ చేస్తున్నప్పుడే పడి పడి నవ్వాము. ఇందులో వెన్నెల కిషోర్ గారి కామెడీని చాలా ఎంజాయ్ చేశాను. మా ఇద్దరి మధ్య వచ్చే సీన్స్ కూడా హిలేరియస్ గా ఉంటాయి. మొన్న సినిమా చూసినప్పుడు కూడా విపరీతంగా ఎంజాయ్ చేశాం. రాజేంద్రప్రసాద్ గారి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో కామెడీ అదిరిపోతుంది.
 
- ఇంత ఫన్ ఉన్న సినిమాని నా కెరీర్లో ఇప్పటివరకు చేయలేదు. నా కెరీర్లో కంప్లీట్ ఫన్ ఎంటర్టైనర్ గా నిలిచే సినిమా ఇది.
 
మైత్రి మూవీ మేకర్స్ గురించి?
- నేను మైత్రి ఫ్యామిలీ లో ఉన్నానని చెప్పుకోవడం చాలా గర్వంగా ఉంటుంది. వారి బ్యానర్ లో నటించడం చాలా ఆనందంగా ఉంది. చాలా మంచి ప్రొడ్యూసర్స్. చాలా కంఫర్టబుల్ గా చూసుకుంటారు ఇంట్లో సినిమా చేస్తే ఎలా ఉంటుందో అంత హ్యాపీగా ఉంటుంది.
 
వరుసగా సినిమాలు చేస్తున్న మీరు.. ఒక ఏడాది గ్యాప్ ఇవ్వడానికి కారణం?
-లాస్ట్ ఇయర్ నా నుంచి కంటిన్యూస్ గా దాదాపు ప్రతి నెలకి ఒక రిలీజ్ ఉండేది. ఒక్కొక్క రోజుకి 4, 5 షిఫ్ట్లు పని చేశాను. అలా ప్లాన్ చేయడానికి కూడా కారణం నా ఫైనల్ ఇయర్ ఉంది కాబట్టి. ఎడ్యుకేషన్ లో ఫైనల్ ఇయర్ లో ఉన్నాను కాబట్టి ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికి అలా ప్లాన్ చేశాను. ఒక ఏడాది బ్రేక్ తీసుకుంటానని నాకు ముందు నుంచే అంచనా ఉంది. అయితే ఈ గ్యాప్ లో చాలా మంచి సినిమాలు చేయలేకపోయాను. చాలా సినిమాలు వదులుకున్నాను. ఇప్పుడు మెడిసిన్ పూర్తయింది. అయితే కాలేజీలో కొన్ని రూల్స్ ఉంటాయి. దానికి తగ్గట్టుగా అటెండ్ అవుతున్నాను.  
 
భగవంత్ కేసరి తర్వాత మీరు చేసే పాత్రలో చాలా మార్పులు ఉంటాయని భావించాం? ఫ్యూచర్లో అలాంటి క్యారెక్టర్స్ చేస్తారా?
- కచ్చితంగా. నేను చేసిన సినిమాల్లో క్యారెక్టర్ గుర్తుపెట్టుకోవడం చాలా అరుదు. కానీ భగవంత్ కేసరి తర్వాత అందరూ విజ్జి పాప అని పిలవడం మొదలుపెట్టారు. ఎక్కడికి వెళ్ళినా ఆ రెస్పాన్స్ అద్భుతం. అలా క్యారెక్టర్ పేరు గుర్తుపెట్టుకునే సినిమాలు చేయాలనేది ఉంది. కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాలు చేస్తూనే అలాంటి మంచి మెసేజ్ ఉన్న పాత్రలు, సినిమాలు చేయాలని భావిస్తున్నాను.
 
మీరు బాలీవుడ్ లో కనిపించిన ప్రతిసారి మీరు అక్కడికి షిఫ్ట్ అయిపోతున్నారు ఏమో అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి?
- తెలుగు ఇండస్ట్రీ నా ఇల్లు. బాలీవుడ్ కి వెళ్ళిపోవడం ఎప్పటికీ జరగదు. ఇంపాజిబుల్.
 
కొత్తగా చేస్తున్న సినిమాలు?
-పరాశక్తి సినిమా చేస్తున్నాను. రవితేజ గారితో మాస్ జాతర చేస్తున్నాను. కన్నడ-తెలుగు లో జూనియర్ సినిమా చేస్తున్నా. ఇంకొన్ని సినిమాలు ఉన్నాయి. మేకర్స్ అనౌన్స్ చేస్తారు.