సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By srinivas
Last Modified: శుక్రవారం, 21 సెప్టెంబరు 2018 (19:54 IST)

దేవ‌దాస్ ట్రైల‌ర్ టాక్ ఏంటి..?

టాలీవుడ్ కింగ్ నాగార్జున - నేచుర‌ల్ స్టార్ నాని కాంబినేష‌న్‌లో రూపొందిన భారీ మ‌ల్టీస్టార‌ర్ దేవ‌దాస్. ఈ క్రేజీ మ‌ల్టీస్టార‌ర్‌ను వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌పై అశ్వ‌నీద‌త్ నిర్మించారు. యువ ద‌ర్శ‌కుడు శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. అక్కినే

టాలీవుడ్ కింగ్ నాగార్జున - నేచుర‌ల్ స్టార్ నాని కాంబినేష‌న్‌లో రూపొందిన భారీ మ‌ల్టీస్టార‌ర్ దేవ‌దాస్. ఈ క్రేజీ మ‌ల్టీస్టార‌ర్‌ను వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌పై అశ్వ‌నీద‌త్ నిర్మించారు. యువ ద‌ర్శ‌కుడు శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. అక్కినేని జ‌యంతి సంద‌ర్భంగా దేవ‌దాస్ ఆడియో పార్టీని ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ పాట‌ల పార్టీలో దేవ‌దాస్ ట్రైల‌ర్ రిలీజ్ చేసారు. ఈ ట్రైల‌ర్ 2 నిమిషాల 6 సెక‌న్లు క‌ట్ చేసారు. నాగ్, నానిల‌పై చిత్రీక‌రించిన స‌న్నివేశాలు హైలైట్‌గా నిలుస్తాయ‌నిపిస్తుంది. 
 
నాగ్ ఎన‌ర్జీ, నాని ఫ‌న్ క‌లిసి ఈ సినిమా న‌వ్వుల పండ‌గ‌ను అందించ‌డం ఖాయం అనేలా ఉంది. ప్రేక్ష‌కులు కోరుకునే అన్ని అంశాలు ఇందులో ఉన్నాయ‌నే ఫీలింగ్ క‌లిగించింది. ఆఫీస‌ర్‌తో నిరాశ ప‌రిచిన నాగ్ ఈ సినిమాతో కింగ్ ఈజ్ బ్యాక్ అనిపిస్తాడు అని ట్రైల‌ర్ చూసిన వాళ్లు చెబుతున్న మాట‌. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ నెల 27న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతున్నాడు. మ‌రి.. అంచ‌నాల‌కు తగ్గ‌ట్టుగానే దేవ‌దాస్ సెన్సేష‌న్ క్రియేట్ చేస్తాడ‌ని ఆశిద్దాం.