నేను-ఇళయరాజా ఇప్పటికీ ఫ్రెండ్సే.. నోటీసులు కంటే ఫోన్ కాల్‌తో?: ఎస్పీబీ ఆవేదన
ప్రముఖ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం వరల్డ్ టూర్ సందర్భంగా తాను దర్శకత్వం వహించిన పాటలను పాడకూడదంటూ ఎస్పీబీకి ఇళయరాజా కోర్టు ద్వారా నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. దీనిపై ఎస్పీబీ స్పందిస్తూ.. మ్యూజిక్ మ్యాస
ప్రముఖ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం వరల్డ్ టూర్ సందర్భంగా తాను దర్శకత్వం వహించిన పాటలను పాడకూడదంటూ ఎస్పీబీకి ఇళయరాజా కోర్టు ద్వారా నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. దీనిపై ఎస్పీబీ స్పందిస్తూ.. మ్యూజిక్ మ్యాస్ట్రో అయిన ఇళయరాజా తాను ఇప్పటికే స్నేహితులమేనని చెప్పారు. కానీ కోర్టు ద్వారా ఆయన పంపిన లీగల్ నోటీసు ద్వారా తాను కలత చెందానని చెప్పారు.
ఇళయరాజా తానీ ఆయన ఆఫీసు నుంచి ఎవరైనా సరే పాటలు పాడవద్దని సమాచారం ఇస్తే బాగుండేదని, ఒక్క ఫోన్‌కాల్ ద్వారా సమస్య అక్కడే పరిష్కారమైపోయేదన్నారు. ఏది ఏమైనా వరల్డ్ టూర్ మాత్రం కొనసాగుతుందని.. అదృష్టం కొద్దీ.. ఇతర సంగీత దర్శకులు కంపోజ్ చేసిన ఎన్నో హిట్ పాటలను తాను పాడానని.. ప్రేక్షకుల నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాలేదన్నారు.
సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనప్పటి నుంచే రాజా తనకు స్నేహితుడని.. ఆయనో గొప్ప జ్ఞాని అని.. ఆయన కంపోజ్ చేసిన పాటలను పాడేందుకే తాను పుట్టానని చాలా మంది చెప్పారన్నారు. ఇంకా మా ఇద్దరి మధ్య విబేధాలు లేవన్నారు. నోటీసుల సమస్యకు కాలమే పరిష్కారం చూపుతుందని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఇటీవల బాలసుబ్రహ్మణ్యం బ్యాగు చోరీకి గురైంది. అందులో పాస్ట్‌పోర్ట్, క్రెడిట్ కార్డులు, కొంత నగదు సహా పాటల స్క్రిప్టులు ఉన్నట్లు తెలిసింది.