ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , బుధవారం, 26 ఏప్రియల్ 2017 (07:10 IST)

రాజమౌళి అంత అరుదైన బహుమతి ఇచ్చినా ప్రభాస్ మహభారత్ అంటున్నాడే

దాదాపు ఐదేళ్లు రాజమౌళి చెప్పింది చేస్తూ బాహుబలికి జీవితాన్ని అంకితం చేసిన ప్రభాస్‌కు దర్శకుడినుంచి గొప్ప బహుమతే లభించింది. ‘బాహుబలి’ చిత్రంలో అమరేంద్ర బాహుబలి ధరించిన విలువైన కవచాన్ని రాజమౌళి ప్రభాస్‌కు బహుమతిగా ఇచ్చినట్లు వినికిడి. ఈ విషయం రాజమౌళి

దాదాపు ఐదేళ్లు రాజమౌళి చెప్పింది చేస్తూ బాహుబలికి జీవితాన్ని అంకితం చేసిన ప్రభాస్‌కు దర్శకుడినుంచి గొప్ప బహుమతే లభించింది. ‘బాహుబలి’ చిత్రంలో అమరేంద్ర బాహుబలి ధరించిన విలువైన కవచాన్ని రాజమౌళి ప్రభాస్‌కు బహుమతిగా ఇచ్చినట్లు వినికిడి. ఈ విషయం రాజమౌళి ఇటీవలే ఒక టీవీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపినట్లు సమాచారం. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఒక సినిమాకు ఒక హీరో దాదాపు అయిదేళ్ల సమయాన్ని దర్శకుడి అర్పించిన ఘటన గత అయిదారు దశాబ్దాల్లో ఎన్నడూ వినలేదు. చూడలేదు.


అందుకే తన మాటను నమ్మి తనతో పాటు బాహుబలికోసం అన్నేళ్లు ప్రయాణించిన ప్రభాస్‌కు రాజమౌళి కృతజ్ఞతా సూచకంగా ఆ విలువైన కవచాన్ని బహుమతిగా ఇచ్చాడు. ఓ హీరో ఒక ప్రాజెక్టు కోసం ఇన్నేళ్లు కేటాయించడం అరుదుగా చేస్తుంటాం. ఈ చిత్రంలోని తన పాత్రల కోసం ప్రభాస్‌ కసరత్తులు చేసి, బరువు పెరిగారు. దాదాపు ఐదేళ్లు ప్రభాస్‌ ‘బాహుబలి’, ‘బాహుబలి 2’ చిత్రాల కోసం పనిచేశారు. 
 
కానీ బాహుబలి తర్వాత తన డ్రీమ్ ప్రాజెక్టు మహాభారత్ అని రాజమౌళి చెబుతుంటే మలయాళ చిత్రపరిశ్రమలో మోహన్ లాల్ ప్రధాన పాత్రధారిగా తీస్తున్న వెయ్యి కోట్ల విలువైన మహాభారతం సినిమాలో అవకాశమిస్తే నటిస్తానని ప్రభాస్ చెప్పడం ఏమిటి? అసలీ వార్త నిజమేనా అని అభిమానులు సైతం నివ్వెరపోతున్నారు. రాజమౌళి ప్రభాస్ పట్ల అంత కృతజ్ఞత చూపిస్తుంటే ప్రభాస్ ఇలా చేశాడేంటి అని చెవులు కొరుక్కుంటున్నారు సినీ జనం. ఇది ఫేక్ వార్త అయితే బాగుంటుందని కొంతమంది ఆశాభావం. స్వయంగా ప్రభాస్ వివరణ ఇస్తే తప్ప దీని చిక్కుముడి విడదు. 
 
ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లుతో విజయ ఢంకా మోగించిన ‘బాహుబలి’కి కొనసాగింపుగా తెరకెక్కిన ‘బాహుబలి 2’ చిత్రం మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.