బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 29 నవంబరు 2024 (12:15 IST)

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

subbaraju marraige
తెలుగు చిత్రపరిశ్రమలో మోస్ట్ బ్యాచిలర్ నటుడుగా ఉన్న సుబ్బరాజు ఇటీవల వివాహం చేసుకున్నారు. 47 యేళ్ళ వయసులో ఆయన ఓ ఇంటివారయ్యాడు. స్రవంతి అనే యువతిని ఆయన వివాహం చేసుకున్నారు. వీరి వివాహం కూడా అమెరికాలో చాలా సింపుల్‌గా హిందూ సంప్రదాయం ప్రకారం జిరగింది. కేవలం ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు, అతి కొద్దిమంది మిత్రుల సమక్షంలో పెళ్లి జరిగింది. ఈ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొత్త జంటకు నెటిజన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 
 
అయితే, సుబ్బరాజు పెళ్లి చేసుకున్న యువతి వివరాలు, ఆమె నేపథ్యం గురించి ఎవరికీ తెలియదు. దీనిపైనే ఆసక్తికరంగా చర్చ సాగుతుంది. ఆ యువతి నేపథ్యం గురించి పలువురు ఆరా తీస్తున్నారు. స్రవంతి కుటుంబం చాలా సంవత్సరాల క్రితమే అమెరికా స్థిరపడిపోయింది. కొలంబియా యూనివర్శిటీ, జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ నుంచి స్రవంతి బీడీఎస్, డీడీఎస్, ఎంపీహెచ్ పూర్తి చేశారు. ప్రస్తుతం ఫ్లోరిడాలోని నార్త్ ఫుడ్ డెంటల్ సెంటర్స్‌లో డెంటిస్ట్‌గా పని చేస్తున్నారు. 
 
సాధారణంగా ఆడంబరాలకు దూరంగా ఉండే సుబ్బరాజు... తన వివాహాన్ని కూడా చాలా సింపుల్‌గా చేసుకున్నారు. పెళ్లి అమెరికాలో జరిగినప్పటికీ హైదరాబాద్ నగరంలో రిసెప్షన్ ఏర్పాటు చేసేందుకు ఆయన ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.