మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 15 నవంబరు 2024 (14:44 IST)

యువకుడితో వదినకు అక్రమ సంబంధం.. వేధింపులు భరించలేక ఆడపడుచు ఆత్మహత్య

crime
తన అన్న భార్య (వదిన) శైలజకు పెళ్లికి ముందు నుంచే ఓ యువకుడుతో వివాహేతర సంబంధం ఉన్నట్టు ఆ ఇంటి ఆడపడుచు స్రవంతి (19) పసిగట్టింది. ఈ విషయం ఎక్కడ బయటపడుతుదోనన్న భయంతో శైలజ ప్రతిరోజూ భయంతో కుంగిపోసాగింది. ఈ క్రమంలో తన ప్రియుడు ఇచ్చిన సలహాలు, సూచనలతో స్రవంతిని శైలజ వేధించడం మొదలుపెట్టింది. పైగా, స్రవంతికి క్రమం సంబధం అంటగట్టింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆడపడుచు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఈ నెల 11వ తేదీన జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్ నగరంలోని రసూల్‌పురా ఇందిరమ్మ నగర్‌కు చెందిన విఠల్ అనే వ్యక్తి కుమార్తె స్రవంతి(19) ఈ నెల 11వ తేదీన ఇంట్లో ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. పొరుగున ఉండే ఓ యువకుడి వేధింపులతోనే కూతురు ఆత్మహత్య చేసుకుందని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు... లోతుగా విచారణ జరిపారు. ఇందులో భాగంగా, స్రవంతి మొబైల్ ఫోనును పరిశీలించగా యూసుఫ్‌గూడ రహమ్ నగర్‌లో ఉంటున్న నవీన్ కుమార్‌ను దుపులోకి తీసుకుని విచారించారు.
 
స్రవంతి వదిన శైలజకు నవీన్ కుమార్‌తో పెళ్లికి ముందునుంచే వివాహేతర సంబంధం ఉన్నట్లు గుర్తించారు. అతను ఇటీవల మళ్లీ శైలజను కలవడం ప్రారంభించాడు. ఈ విషయాన్ని స్రవంతి గుర్తించింది. ఈ విషయం ఎక్కడ బయటపడుతుందోనని భావించి వదిన స్రవంతికి ఇంటి పక్కనే ఉండే ఓ యువకుడితో సంబంధం ఉందంటూ దుష్ప్రచారం చేస్తూ వేధించసాగింది. అతను తనకు సోదరుడి వంటివాడని చెప్పినా వినిపించుకోకుండా వేధింపులు ఆపలేదు. 
 
పైగా తనతో సంబంధం ఉన్న నవీన్ కుమార్‌ను రంగంలోకి దించి అతనితో స్రవంతి ఫోన్‌కు సందేశాలు పంపిస్తుండేది. వదిన, నవీన్ కుమార్‌లు పెట్టే వేధింపులు తట్టుకోలేక స్రవంతి ఆత్మహత్యకు పాల్పడింది. కోడలే తన కూతురు ఆత్మహత్యకు కారణమైనట్లు పోలీసుల విచారణలో బయటపడటంతో స్రవంతి తల్లిదండ్రులు అవాక్కయ్యారు. శైలజతో పాటు నవీన్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు.