చంద్రబాబు అరెస్టుపై జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదంటే?  
                                       
                  
                  				  టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ విషయంలో ఎన్టీఆర్ వైఖరి ఏమిటి అనే ప్రశ్నకు.. జూనియర్ ఎన్టీఆర్ స్నేహితుడు, నటుడు, రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
				  											
																													
									  
	 
	స్కిల్ కేసులో అరెస్ట్ కావడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికీ బాహాటంగా స్పందించకపోవడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. దీనిపై నందమూరి హీరో బాలయ్య కూడా స్పందించారు. చంద్రబాబు అరెస్టుపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడంపై లెక్కచేయనని తేల్చి పారేశారు. 
				  
	 
	చంద్రబాబు అరెస్ట్ విషయంలో ఎన్టీఆర్ వైఖరి ఏమిటి అనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, బహుశా సినిమాల వల్లే తారక్ ఈ విషయంలో స్పందించకపోయి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. 
				  																								
	 
 
 
  
	
	
																		
									  
	 
	ఆర్ఆర్ఆర్ సినిమాకు చాలా సమయాన్ని జూనియర్ ఎన్టీఆర్ చాలా సమయం కేటాయించారని.. ఆ సమయంలో మూడ్నాలుగు సినిమాలు చేసి ఉండేవాడు. 
				  																		
											
									  
	 
	తారక్ ప్రస్తుతం దేవరతో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా కూడా రెండు భాగాలుగా వస్తోందంటున్నారు. దాంతో తారక్ తన దృష్టంతా సినిమాలపైనే కేంద్రీకరించాడు. అందుకే రాజకీయాలపై స్పందించలేదని భావిస్తున్నానని రాజీవ్ కనకాల వివరించారు.