శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 3 నవంబరు 2021 (15:00 IST)

భార్య రమను ఉద్యోగానికి పంపుతానంటున్న రాజమౌళి!

తెలుగు చిత్రపరిశ్రమలో అగ్ర దర్శకుడు ఎస్ఎస్.రాజమౌళి. ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇపుడు ఆసక్తిగా మారాయి. ఒక్కో చిత్రానికి కోట్లాది రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్న రాజమౌళికి సొంత నిర్మాణ సంస్థ కూడా ఉంది. అయితే, తాను దర్శకత్వం వహించే చిత్రాలు భవిష్యత్‌లో ఫ్లాప్ అయితే తన భార్య రమా రాజమౌళిని ఉద్యోగానికి పంపుతానని చెప్పారు. 
 
ఈయన గ‌తంలో త‌న వ‌ద్ద డ‌బ్బులు లేక అనుభ‌వించిన క‌ష్టాల గురించి చెప్పారు. ప్ర‌స్తుతం ఆయ‌న సినిమా 'ఆర్ఆర్ఆర్' విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది. ఈ నేప‌థ్యంలో ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ, గ‌తంలో ఓ స‌మ‌యంలో తనకు పైసా సంపాదన లేదని, అప్ప‌ట్లో తాను త‌న భార్య సంపాద‌న‌ మీద బతికానని చెప్పారు.
 
భార్య సంపాద‌న‌పై బ‌తికాన‌ని చెప్పుకోవడానికి సిగ్గేయడం లేదని, సంతోషంగానే ఉందని తెలిపారు. తాను దర్శకుడు కాకముందు త‌న భార్య ర‌మ‌ ఉద్యోగం చేసేవార‌ని, ఆమెను ప్ర‌తిరోజు ఉద‌యాన్నే బైక్‌పై ఆఫీసు వ‌ద్ద డ్రాప్ చేసి వ‌చ్చేవాడిన‌ని గుర్తు చేసుకున్నారు.
 
మ‌ళ్లీ సాయంత్రం వెళ్లి ఇంటికి తీసుకొచ్చేవాడిన‌ని చెప్పారు. ఇంట్లో కథ‌లు, డైలాగులు రాసుకోవడం వంటి ప‌ని చేసేవాడినని అన్నారు. భ‌విష్య‌త్తులో త‌న సినిమాల‌కు ఫ్లాపులు వ‌స్తే, సినిమాలు బాగా లేక‌పోతే భార్య‌ను మళ్లీ ఉద్యోగానికి పంపిస్తాన‌ని చెప్పారు. నిజమైన ప్రేమ అంటే ఏంటో త‌న‌ భార్యను చూసిన తరువాతే తెలిసిందని అన్నారు.