1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 3 నవంబరు 2021 (13:59 IST)

దాసరి నారాయణ రావు ఇంటికి నోటీసులు

టాలీవుడ్ దిగ్గజ నటుడు దర్శకుడు దివంగత దాస‌రి నారాయ‌ణ‌రావు ఉన్నపుడు ఇంటికి నోటీసులు జారీచేశారు. ఈ ఇల్లు వివాదాల‌ నడుమ కొనసాగుతోంది. దాసరి మరణం తర్వాత ఆయ‌న త‌న‌యులు ప‌లు వివాదాల‌తో హాట్ టాపిక్‌గా మారుతున్నారు. 
 
తాజాగా దాస‌రి త‌న‌యులు అరుణ్‌, దాసరి ప్రభులకు సిటీ సివిల్ కోర్టు నోటీసులు జారీ చేసింది. వ్యాపార లావాదేవీల్లో భాగంగా ఓ ప్లాంట్ నిర్మాణం కోసం 2.11 లక్షల రూపాయలు తీసుకున్న ప్రభు, అరుణ్‌లు ఒప్పందం ప్రకారం తిరిగి డబ్బులు చెల్లించడంలో జాప్యం చేస్తున్నారు.
 
ఈ నేప‌థ్యంలో సోమశేఖర్‌ రావు సివిల్‌ కోర్టును ఆశ్రయించాడు. అలాగే దాసరి ప్రభు, అరుణ్‌ అప్పుగా తీసుకున్న డబ్బు చెల్లించడంలేదని, త్వరలో తన డబ్బులు చెల్లించేలా వారిపై చర్యలు తీసుకోవాలంటే అతడు పిటిషన్‌ దాఖలు చేశాడు. దీంతో కోర్ట్ దాస‌రి ఇంటికి నోటీసులు పంపింది. ఈ నెల 15వ తేదీ వరకూ డబ్బులు చెల్లించాల్సిందిగా ప్రభు, అరుణ్‌లను ఆదేశించింది.