శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 19 సెప్టెంబరు 2024 (12:13 IST)

విజయ్ దేవరకొండ, సందీప్ వంగా కాంబినేషన్ లో సినిమా వుంటుందా?

Vijay devarakonda, sandeep
Vijay devarakonda, sandeep
హీరో విజయ్ దేవరకొండ సైమా హ్యపీ మూవ్ మెంట్స్ తన లేటెస్ట్ ట్వీట్ లో పోస్ట్ చేశారు. రీసెంట్ గా దుబాయ్ లో జరిగిన సైమా అవార్డ్స్ వేడుకల్లో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సెన్సేషన్ ఆఫ్ ది ఇయర్ గా అవార్డ్ అందుకున్నారు. హీరో ఆనంద్ దేవరకొండకు బేబి సినిమాకు గాను బెస్ట్ యాక్టర్ క్రిటిక్ అవార్డ్ దక్కింది. సైమా వేడుకల్లో పాల్గొన్న విజయ్ దేవరకొండ ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 
 
అవార్డ్స్ ప్రెజెంటేషన్ తర్వాత సందీప్ వంగా, ఆనంద్ దేవరకొండతో హ్యాపీ మూవ్ మెంట్స్ షేర్ చేసుకున్నారు విజయ్ దేవరకొండ. ఈ ఫొటోస్ ఈ రోజు ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు విజయ్ దేవరకొండ. ఈ ట్వీట్ లో విజయ్ దేవరకొండ స్పందిస్తూ - నాకు ఇష్టమైన డైరెక్టర్ సందీప్ వంగాకు సైమా సెన్సేషన్ అవార్డ్ రావడాన్ని సెలబ్రేట్ చేసుకున్నా అలాగే మా బ్రదర్ ఆనంద్ దేవరకొండకు బెస్ట్ యాక్టర్ క్రిటిక్ అవార్డ్ రావడం గర్వంగా సంతోషంగా ఉంది. త్వరలోనే వీడీ 12 మూవీ అప్డేడ్ ఇవ్వబోతున్నాం. అంటూ పేర్కొన్నారు. విజయ్ దేవరకొండ లేటెస్ట్ ట్వీట్ నెటిజన్స్ దృష్టిని బాగా ఆకర్షిస్తోంది.