బాస్ లేడీతో ఒకేచోట హీరోల భార్యలు
హీరోలు సందర్భానుబట్టి ఒకే చోట కలిసి వుండడం మామూలే. అదే హీరోల భార్యలు ఒకేచోట కలువడం కూడా చాలా అరుదైన విషయం. మారిన ట్రెండ్ రీత్యా హీరోల భార్యల మధ్య సత్ సంబంధాలు వుంటున్నాయి. తరచూగా ఏదో ఒక సందర్భంగా వారంతా కలుస్తుంటారు. అలాంటిదే నిన్న రాత్రి ఓ సందర్భంలో వారంతా కలిసారు. కొణిదెల ఉపాసన సోదరికి చెందిన ఓ ఫంక్షన్‌లో అందరూ ఇలా తళుక్కుమన్నారు.
మహేష్‌భార్య నమ్రతా శిరోద్కర్, రామ్‌చరణ్ భార్య ఉపాసన కొణిదల, చిరంజీవి కుమార్తె శ్రీజ కళ్యాణ్, మేఘన గోరుకంటి, అనుష్పాల కామినేని, దియా భూఫాల్ తదితరులు వున్న గ్రూప్ ఫోటోను నమ్రత, ఉపాసన తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. `విత్ బాస్ లేడీ తో వేడుక` అంటూ నమ్రత పోస్ట్ చేసింది. హీరోల మధ్య వున్న సత్ సంబంధాలు తమ మధ్య వున్నాయంటూ తెలియజెప్పే విధంగా ఈ ఫొటో వుంది. తరచూ ఏదో ఒక ఫంక్షన్‌లో కలుసుకుని ఇలా అభిమానులకు సందడి చేస్తున్నారు. ఈ ఫొటోను చూసిన హీరోల అభిమానులు వావ్! అంటూ. కుటుంబ ఫంక్షన్ అంటే ఇలాగే వుంటుందికదా! అంటూ కామెంట్లు చేస్తున్నారు.