ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (12:11 IST)

మహేష్ బాబు, నమ్రతల 15వ వివాహ వార్షికోత్సవం: వంశీ సెట్స్‌లో కలిసి..?

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, నమ్రతలకు ఫిబ్రవరి 10వ తేదీ 15వ వివాహ వార్షికోత్సవం. మహేష్, నమ్రత 2000లో వంశీ సెట్స్‌లో కలుసుకుని ప్రేమలో పడ్డారు. ఐదేళ్లపాటు డేటింగ్ అనంతరం.. ఈ జంట 2005లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. నమ్రతా మహేష్ కంటే నాలుగేళ్ళు పెద్ద.

ఈ కారణంగా, వారి పెళ్లి కోసం తన కుటుంబాన్ని ఒప్పించడానికి నటుడికి చాలా సమయం పట్టింది. ఒకసారి, వాలెంటైన్స్ డే సందర్భంగా, నమ్రత, ఇచ్చిన ఇంటర్వ్యూలో, మహేష్ తన కుటుంబాన్ని ఒప్పించడంతో నాలుగు సంవత్సరాలు వేచి ఉండాల్సిన సమయం గురించి మాట్లాడారు.  
 
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా వుండే ఈ దంపతులకు ఫిబ్రవరి 10వ తేదీ 15వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో మహేష్, నమ్రతల ఫోటోలు వైరల్ అవుతోంది. 
Namrata Shirodkar


ఇంకా పెళ్లి రోజు సందర్భంగా మ‌హేష్ బాబు న‌మ్ర‌త‌కు విషెస్ చెబుతూ ఓ రొమాంటిక్ ఫొటోను షేర్ చేశారు. ఆ ఫొటోలో విమానంలో మ‌హేష్, న‌మ్ర‌త‌కు ముద్దు పెడుతున్నారు. ఇక న‌మ్ర‌త కూడా త‌న సోష‌ల్ మీడియాలో మ‌హేష్‌తో తీసుకున్న రొమాంటిక్ ఫొటోను షేర్ చేసి.. తామిద్ద‌రి ఇన్నేళ్ల జీవితంలో ప్రేమ‌, న‌మ్మ‌కం ఉన్నాయ‌ని కామెంట్ పెట్టారు.