ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 22 డిశెంబరు 2017 (17:21 IST)

'లైంగిక వేధింపు'ల నటికి పెళ్లి డేట్ ఫిక్స్ అయింది...

భావన.. మలయాళ నటి. ఈమె తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. తెలుగులో 'మహాత్మ', 'ఒంటరి', 'నిప్పు' వంటి చిత్రాలలో నటించింది. అయితే, ఇటీవల మలయాళ నటుడు దిలీప్ ఈమెను కిడ్నాప్ చేయించి, లైంగికంగా వేధించాడు. ద

భావన.. మలయాళ నటి. ఈమె తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. తెలుగులో 'మహాత్మ', 'ఒంటరి', 'నిప్పు' వంటి చిత్రాలలో నటించింది. అయితే, ఇటీవల మలయాళ నటుడు దిలీప్ ఈమెను కిడ్నాప్ చేయించి, లైంగికంగా వేధించాడు. దీంతో ఆమె ప్రతి రోజూ వార్తల్లో నానుతూ వచ్చింది.
 
ఈ నేపథ్యంలో మార్చిలో కన్నడ సినీ నిర్మాత నవీన్‌తో భావనకు నిశ్చితార్థం జరిగింది. కుటుంబ సభ్యుల మధ్య కోచీలో ఈ వేడుక ప్రైవేట్‌గా ఈ నిర్వహించారు. అయితే, పెళ్లి డిసెంబరు నెలలో అంటూ ఈ మధ్య పలు పుకార్లు షికారు చేశాయి. 
 
కానీ తాజాగా వీరు పెళ్లి కార్డుతో అన్ని రూమర్స్‌కి చెక్ పెట్టారు. జనవరి 22న కేరళలోని త్రిసూర్‌లో ఉన్న "లలు కన్వెన్షన్ సెంటర్‌"లో వీరి వివాహం జరుగనుంది. ఉదయం 10.30 నుండి 11.30ని.ల మధ్య శుభముహుర్తంగా నిర్ణయించారు. ఈ మేరకు ఓ వెడ్డింగ్ కార్డును సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 
 
కాగా, పీసీ శేఖర్ 2012లో నిర్మించిన రోమాంటిక్ కామెడీ చిత్రం 'రోమియో'తో భావన, నవీన్ ప్రేమపక్షులుగా మారారు. గడిచిన ఐదు సంవత్సరాలుగా వీరు ప్రేమబంధంలో కొనసాగుతుండగా, త్వరలోనే ఓ ఇంటివారు కానున్నారు.