శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 27 నవంబరు 2017 (16:06 IST)

ఇవిగో రూ.1.5 కోట్లు, నటి భావనను రేప్ చెయ్... రిపోర్టులో షాకింగ్...

మలయాళ సినీ ఇండస్ట్రీలో నటి భావనకు సంబంధించి మరో షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. భావనపై అత్యాచారం చేస్తే రూ. 1.5 కోట్లు ఇస్తానని చెప్పిన నటుడు దిలీప్, ఈ వ్యవహారాన్నంతా పల్సర్ సునీతో చర్చించినట్లు సిట్ తన నివేదికలో పేర్కొంది. అంతేకాదు, నటి భావనపై అత్యాచ

మలయాళ సినీ ఇండస్ట్రీలో నటి భావనకు సంబంధించి మరో షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. భావనపై అత్యాచారం చేస్తే రూ. 1.5 కోట్లు ఇస్తానని చెప్పిన నటుడు దిలీప్, ఈ వ్యవహారాన్నంతా పల్సర్ సునీతో చర్చించినట్లు సిట్ తన నివేదికలో పేర్కొంది. అంతేకాదు, నటి భావనపై అత్యాచారం చేసి, దాన్ని వీడియో కూడా తీయాలని దిలీప్ అతడితో చెప్పినట్లు పేర్కొంది. 
 
డబ్బు కూడా పల్సర్ సునీ తల్లి ఖాతాలో జమ అయినట్లు వెల్లడించింది. అంతకుముందు భావన గోవా షూటింగుకు వెళితే అక్కడ ఆమెను వేధించాలని ప్లాన్ చేసుకున్నారనీ, చివరి నిమిషంలో భావన తన ట్రిప్ క్యాన్సిల్ చేసుకోవడంతో ఆ ప్లాన్ ఫ్లాప్ అయినట్లు నివేదికలో వెల్లడించింది. 
 
2013 నుంచి భావనపై అత్యాచారం చేయాలని చూసినప్పటికీ ప్రతిసారీ ఫెయిల్ అయినట్లు పేర్కొన్నారు. చివరికి 2017లో నటి భావనపై లైంగిక వేధింపులకు తెగబడిన సంగతి తెలిసిందే. ఇదిలావుంటే ఈ కేసులో ఇప్పటికే బెయిల్ పొందిన దిలీప్, నాలుగు రోజుల పాటు దుబాయ్ వెళ్లేందుకు కూడా అనుమతి లభించింది.