శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By TJ
Last Modified: శనివారం, 11 నవంబరు 2017 (18:18 IST)

శశికళ రూ.1000 కోట్లు ఐటీ ఎగవేత? ఇప్పటిదాకా ఏం చేసినట్లు?

గత మూడు రోజుల నుంచి జయ గ్రూప్స్‌కు సంబంధించిన కంపెనీలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. ఐటీ శాఖ అధికారులే దిమ్మతిరిగిపోయే విధంగా జయ గ్రూప్స్‌లో కోట్ల రూపాయల పన్నును ఎగవేసినట్లు తేలింది. ఒకటిరెండు కాదు. ఏకంగా వెయ్యి కోట్ల రూపాయల ప

గత మూడు రోజుల నుంచి జయ గ్రూప్స్‌కు సంబంధించిన కంపెనీలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. ఐటీ శాఖ అధికారులే దిమ్మతిరిగిపోయే విధంగా జయ గ్రూప్స్‌లో కోట్ల రూపాయల పన్నును ఎగవేసినట్లు తేలింది. ఒకటిరెండు కాదు. ఏకంగా వెయ్యి కోట్ల రూపాయల పన్నును ఎగవేసింది జయగ్రూప్స్. ప్రస్తుతం మొత్తం శశికళ చేతుల్లోను ఈ గ్రూప్స్ నడుస్తుండడంతో ఐటీ శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
 
1800 మంది ఐటీ సిబ్బంది బృందాలుగా ఏర్పడి 147 ప్రాంతాల్లో ఏక కాలంలో సోదాలు కొనసాగిస్తున్నారు. పది బోగస్ కంపెనీలను ఏర్పాటు చేసి ఆ కంపెనీల ద్వారా వెయ్యి కోట్ల రూపాయల పన్నును ఎగవేసినట్లు ఐటి శాఖ అధికారులు గుర్తించారు. 
 
శశికళ డైరెక్టర్‌గా ఉన్న మూడు బోగస్ కంపెనీలు గత మూడురోజుల క్రితమే మూతపడ్డాయి. ప్రస్తుతం ఉన్న ఈ కంపెనీలపై విచారణ జరుగుతోంది. దేశంలోనే ఈ స్థాయిలో ఐటీ అధికారులు 1800 మంది కలిసి బృందాలుగా ఏర్పడి సోదాలు జరపడం ఇదే ప్రథమం. ఐతే ఇప్పటిదాకా ఐటీ అధికారులు తనిఖీలు చేయకుండా ఏం చేసినట్లూ అనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి.