శనివారం, 2 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 3 ఆగస్టు 2024 (09:15 IST)

ఇండస్ట్రీలో అవకాశాలకోసం వచ్చే యువతుల్లారా తస్మాత్ జాగ్రత్త - ఛాంబర్ విజ్నప్తి

Telgu film chamber, council
Telgu film chamber, council
తెలుగు సినిమా పరిశ్రమలో సహాయ దర్శకుడు గా పనిచేస్తున్నానని సిద్ధార్థ వర్మ అనే వ్యక్తి  సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న ఒక యువతిని సినిమాల్లో వేషాలు ఇప్పిస్తానని చెప్పి మోసం చేసి ఆమెను మానభంగం చేయడం జరిగిందని, సదరు యువతి పోలీస్ వారికి ఫిర్యాదు ఇచ్చిందని వార్త పత్రికలు, టీవీలు ద్వారా తెలుసుకొని తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్, తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ వారిని సిద్దార్థ వర్మ గురించి విచారించగా సదరు అసోసియేషన్ వారు సిద్దార్థ వర్మ తమ సభ్యుడు కాదని, అతను ఏ దర్శకుడు దగ్గర సహాయకుడిగా పనిచేయడం లేదని తెలిపినారు.

ముఖ్యంగా సినిమాల్లో వేషాలు వేయాలని తాపత్రయ పడే  యువతులు  ఇటువంటి వారిని దగ్గరకు రానివ్వకూడదని, ఇలాంటి వ్యక్తుల చర్యలకు అమ్మాయిలు అనాలోచితంగా ఉండవద్దని మనవి చేయుచున్నాము.
 
ఇటువంటి సంఘటనలను ఆడపిల్లలు ఒక హెచ్చరికగా భావించాలని కోరుకుంటూ, ఫిలిం ఇండస్ట్రీ లో పనిచేయాలన్న ఉత్సాహంతో వస్తున్న వారు మగవారైనా, ఆడవారైనా ఇటువంటి మోసపూరితమైన సంఘటనలకు బలి కాకుండా వారు చెప్పే మాటలను నమ్మకుండా, ఇటువంటి విషయాల మీద ఆచి తూచి తెలుసుకుని పెద్దల సలహాతో అడుగు వేయాలని తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ విజ్ఞప్తి చేయుచున్నది. ఈ విషయమై ఛాంబర్ అధ్యక్షులు పి.భరత్ భూషణ్,  కార్యదర్శులు కె. ఎల్. దామోదర్ ప్రసాద్) (కె. శివప్రసాద రావు) లిఖిత పూర్వకంగా తెలియజేసారు.