గురువారం, 2 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 18 మే 2021 (17:08 IST)

28న ఓటీటీలో ‘క్యాబ్ స్టోరీస్’

Cab Stories
కరోనా లాక్‌డౌన్ కారణంగా సినిమా థియేటర్లన్నీ మూత పడడంతో సినీ ప్రియులు ఎంటర్‌టైన్ మెంట్ కోసం ఓటీటీలపై ఆధారపడుతున్నారు. ఇప్పటికే ఎన్నో ఓటీటీలు ఉండగా తాజాగా కొత్త ఓటీటీలు కూడా వస్తున్నాయి. తాజాగా స్పార్క్పేరుతో సాగర్ మాచనూరు ఓటీటీని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ స్పార్క్ ఓటీటీలో ఆర్జీవీ ‘డీ కంపెనీ’ ఇటీవల విడుదలై సంచలనం సృష్టించగా తాజాగా మరో సినిమా రాబోతోంది. అదే ‘క్యాబ్ స్టోరీస్’.
 
తెలుగు బిగ్‌బాస్-4 ఫేమ్ దివి విద్య లీడ్ రోల్‌లో నటించిన చిత్రం ‘క్యాబ్ స్టోరీస్’. సరికొత్త కాన్సెప్ట్‌తో అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రానికి కేవీఎన్ రాజేష్ దర్శకత్వం వహించారు. ‘గాలి సంపత్’ సినిమాను నిర్మించిన ఎస్ కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. ఈ చిత్రానికి సాయి కార్తిక్ సంగీతం అందించారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 28న స్పార్క్ ఓటీటీలో డిజిటల్ ప్రీమియర్ కానుంది. గిరిధర్, ధన్‌రాజ్, ప్రవీణ్, శ్రీహన్, సిరి తదితరులు నటించిన ఈ చిత్రంపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.
 
నటీనటులు
దివి విద్య, గిరిధర్, ధన్ రాజ్, ప్రవీణ్, శ్రీహన్, సిరి
 
సాంకేతిక నిపుణులు
దర్శకుడు: కేవీఎన్ రాజేష్
నిర్మాత: ఎస్ క్రిష్ణ
సినిమాటోగ్రాఫర్: సుజాత సిద్ధార్థ్
సంగీత దర్శకుడు: సాయి కార్తిక్
ఎడిటర్: తిమ్మరాజు