శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 18 మే 2021 (16:09 IST)

విజయ్ సేతుపతి సరసన కత్రినా కైఫ్.. మెర్రీ క్రిస్మస్ టైటిల్ ఖరారు

Vijaysethupathi_Katrina
ఉప్పెన ఫేమ్ విజయ్ సేతుపతికి బంపర్ ఆఫర్లు వస్తున్నాయి. ఈ సూపర్ హీరో సరసన టాప్ హీరోయిన్లు పోటీపడేందుకు సై అంటున్నారు. ఈ సినిమా ద్వారా కత్రినా కైఫ్ కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుందని టాక్. ఈ చిత్రానికి  'మెర్రీ క్రిస్మస్​' అనే టైటిల్‌నే ఖరారు చేసినట్లు నిర్మాత రమేష్‌ తౌరుని వెల్లడించారు.
 
ఇక ఈ మూవీ అనౌన్స్‌ చేసిన నాటి నుంచి ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విజయ్‌ సేతుపతి- కత్రినా మొదటిసారి నటిస్తుండటంతో మరింత హైప్‌ క్రియేట్‌ అయ్యింది. 
 
‘అంధదూన్’ దర్శకుడు శ్రీ రామ్ రాఘవన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. జూన్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం వున్నట్లు తెలుస్తోంది.