పలావు ఏంటే టూత్ పేస్ట్ వాసన వస్తోంది....

సిహెచ్| Last Modified శుక్రవారం, 19 జులై 2019 (22:16 IST)
భర్త- రాజీ... పలావు ఏంటే టూత్ పేస్ట్ వాసన వస్తుంది.
భార్య- ఏమీ లేదండి... పలావులో వేయడానికి లవంగం, పుదీనా, ఉప్పు ఇంట్లో లేవండి... నాదగ్గరేమో డబ్బులు లేవు. అందుకని..... పతాంజలి టూత్ పేస్ట్‌లో అవన్నీ ఉన్నాయి కదా అని టూత్ పేస్ట్ పలావులో కలిపేశానండి.

2.
మహేష్- ఒరేయ్ మావ... హైదరాబాద్‌లో చేప, మందు ఫ్రీ అంటగా... బయలుదేరి వస్తున్నావా.
సురేష్- ఒరేయ్ దరిద్రుడా... దాని అర్థం అది కాదురా..... చేప, మందు కాదురా చేప మందు.

3.
కాంతారావు- బావ... ఏంటి ఈ టైంలో బయటతిరుగుతున్నావు.
రామారావు- మీ అక్క... పాట పాడుతాను తాళం వెయ్యమంది. అది పాట మొదలుపెట్టగానే నేను తాళం వేసి బయటకు వచ్చాను బావ.దీనిపై మరింత చదవండి :