మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. రాబోయే చిత్రాలు
Written By Mohan
Last Modified: మంగళవారం, 17 అక్టోబరు 2017 (19:49 IST)

విజయ్ హీరోగా 'బాహుబలి' రైటర్ 'అదిరింది' దీపావళి విడుదల...

గత దశాబ్దకాలంగా తమిళ హీరోలు మన తెలుగులో మార్కెట్ పెంచుకునేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్నారు, కానీ అందులో నటులు సూర్య, విక్రమ్, విశాల్, కార్తీ లాంటి వాళ్లు తమ సినిమాలను రెండు భాషల్లో రిలీజ్ చేస్తూ వస్తున్నారు. వీరు కొంతవరకు తమ మార్కెట్‌ను తెలుగులోనూ

గత దశాబ్దకాలంగా తమిళ హీరోలు మన తెలుగులో మార్కెట్ పెంచుకునేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్నారు, కానీ అందులో నటులు సూర్య, విక్రమ్, విశాల్, కార్తీ లాంటి వాళ్లు తమ సినిమాలను రెండు భాషల్లో రిలీజ్ చేస్తూ వస్తున్నారు. వీరు కొంతవరకు తమ మార్కెట్‌ను తెలుగులోనూ పెంచుకున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. వీరికి ముందుతరం హీరోలైన కమల్‌హాసన్, రజనీకాంత్‌లు సైతం తమ సినిమాలను తెలుగులోనూ అనువదిస్తున్నారు. 
 
ఇప్పుడు హీరో విజయ్ సైతం తన అదృష్టాన్ని పరీక్షించుకోడానికి గత కొంతకాలంగా గజనీ మహ్మద్‌లా గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. కానీ లాభం లేకుండా పోయింది. 2011లో శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'స్నేహితుడు', మురుగదాస్ దర్శరత్వంలో వచ్చిన 'తుపాకీ', 'కత్తి', రాజు - రాణీ సినిమాల దర్శకుడు అట్లీ దర్శకత్వంలో వచ్చిన 'పోలీసోడు' సినిమా కూడా తెలుగులో నిరాశే మిగిల్చింది. 
 
కానీ ఈసారి దీపావళి కానుకగా అదే దర్శకుడితో 'అదిరింది' సినిమాను తీసుకొస్తున్నాడు. ఆ సినిమా రేపట్నుంచి థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏ ఆర్ రెహమాన్ సంగీతాన్ని సమకూర్చాడు, బాహుబలి సినిమా రైటర్ 'విజయేంద్ర ప్రసాద్' ఈ సినిమాకు కథను అందించడంతో సినీ ప్రియుల అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇక ఈ సినిమా ఎంతమేర విజయ్‌కి అదిరే హిట్టిస్తుందో చూడాలంటే రేపటి వరకూ ఆగాల్సిందే.