ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By dv
Last Updated : శుక్రవారం, 19 ఆగస్టు 2016 (14:20 IST)

బూజుపట్టిన కథతో రొటీన్‌ ఫార్మెట్‌లో 'చుట్టాలబ్బాయ్‌'.. ఖర్చు పెట్టిన రూ.కోట్లు సంగతేంటి? (రివ్యూ)

నాగార్జునతో మూడేళ్ళనాడు 'భాయ్‌' అనే సినిమాకు దర్శకత్వం వహించి.. డిజాస్టర్‌ చిత్రంగా నాగ్‌ కెరీర్‌లో నిలిచేలాచేసిన దర్శకుడు వీరభద్రమ్‌ చౌదరి. ఆ చిత్రం ఇచ్చిన దెబ్బతో కష్టపడి కథను రాసుకుని.. ని, శర్వానం

నటీనటులు:
ఆది, సాయికుమార్‌, నమితా ప్రమోద్‌, పోసాని కృష్ణమురళి, అలీ, పృథ్వీ, రఘుబాబు, షకలక శంకర్‌, గిరి, అభిమన్యుసింగ్‌, వంశీకృష్న, అన్నపూర్ణమ్మ తదితరులు. 
 
సాంకేతికతవర్గం: సంగీతం: తమన్‌, నిర్మాతలు వెంకట్‌ తలారి, రామ్‌ తాళ్లూరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వీరభద్రమ్‌ చౌదరి.
 
నాగార్జునతో మూడేళ్ళనాడు 'భాయ్‌' అనే సినిమాకు దర్శకత్వం వహించి.. డిజాస్టర్‌ చిత్రంగా నాగ్‌ కెరీర్‌లో నిలిచేలాచేసిన దర్శకుడు వీరభద్రమ్‌ చౌదరి. ఆ చిత్రం ఇచ్చిన దెబ్బతో కష్టపడి కథను రాసుకుని.. ని, శర్వానంద్‌లతో చేద్దామని అనుకుని కుదరక.. సాయికుమార్‌ కొడుకు ఆదితో సినిమా చేశాడు. ఎన్‌ఆర్‌ఐ నిర్మాతలు ఇద్దరు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకువచ్చారు. ఎన్నో సినిమాలు పరిశీలించిన నిర్మాతలకూ 'చుట్టాలబ్బాయ్‌' కథ బాగా నచ్చి కోట్లు ఖర్చుపెట్టి తీశారు. మరి అదెలా వుందో చూద్దాం.
 
కథ:
బాబ్జీ (ఆది) హైదరాబాద్‌లో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లోన్‌ సెక్షన్‌ రికవరీ ఆఫీసర్‌గా చేస్తుంటాడు. ఫ్రెండ్‌ సిస్టర్‌ మేరేజ్‌లో కావ్య (నమితా ప్రమోద్‌) పరిచయం ఏర్పడుతుంది. ఇష్టంలేని పెళ్ళి నుంచి తప్పించుకొనే క్రమంలో పారిపోతూ.. ఓసారి బాబ్జీకి తారసపడుతుంది. దీంతో ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టు కావ్య అన్న అభిమన్యుసింగ్‌ వీరిని చూసి.. లేచిపోతున్నారనే అపోహతో తన సిబ్బందితో వెంటపడతాడు. వారు తప్పించుకుంటూ ఓ అడవిప్రాంతంగుండా... ఓ గ్రామానికి చేరతారు. అక్కడ వీరిపై ఓ రౌడీగ్యాంగ్‌ ఎటాక్‌ చేసే సమయంలో ఆ ఊరి పెద్ద దొరబాబు (సాయికుమార్‌) వీరిని కాపాడి ఇంటికి తీసుకెళ్తాడు. 
కట్‌చేస్తే.. దొరబాబు, బాబ్జీ తండ్రీకొడుకులు. ఆ తర్వాత మామయ్య కూతురుతో బాబ్జీకి పెండ్లినిశ్చయం చేసే సమంలో బాబ్జీ, కావ్య ప్రేమికులని పెద్దలకు తెలిసి దాన్ని రద్దు చేస్తారు. ఇది తెలుసుకున్న కావ్య తనకు అసలు పెళ్ళే ఇష్టంలేదని చెప్పాపెట్టకుండా పారిపోతుంది. అలా పారిపోతుండగా రౌడీలు వెంటపడితే తిరిగి వెనక్కివస్తుంది? ఆ తర్వాత ఏమి జరిగింది? రౌడీలు ఎందుకు తరుముతున్నారు? తనకు పెళ్లి ఇష్టం లేదని కావ్య ఎందుకు చెప్పింది? అనేది మిగిలిన సినిమా.
 
పెర్‌ఫార్మెన్స్‌
'ప్రేమకావాలి' నుంచి ఆది నాలుగైదు సినిమా చేసినా.. 'చుట్టాలబ్బాయ్‌'తో కాస్త మెరుగైన నటన కన్పించాడు. యూత్‌కు తగిన స్పీడ్‌, లెక్కలేనితనం బాగానే ప్రదర్శించాడు. మలయాళ నటి నమితా ప్రమోద్‌ బాగా చేసింది. పెద్దపెద్ద డైలాగ్స్‌ లేకుండా సింపుల్‌గా హావభావాలు ప్రకటించేసింది. సాయికుమార్‌ చాలాకాలం తర్వాత హుందా తరహా పాత్రలో కనిపించాడు. కాస్త ఆవేశం ఉన్న పాత్ర ఇది. అభిమన్యుసింగ్‌ పోలీసుగా ఓకే. రఘుబాబు రొటీన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌. థర్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ పృథ్వీ పాత్ర నవ్విస్తుంది. బ్రహ్మానందం బదులు ఇతనే తీసుకుని ఆ ఫార్మెట్‌తో రచయితలు డైలాగ్స్‌ రాసేస్తున్నారు. పోసాని పాత్ర రొటీనే. కిడ్నాప్‌లు చేసే గ్యాంగ్‌ బాస్‌గా అలీ నవ్విస్తాడు. షకలక శంకర్‌, గిరి తదితరులు హీరోకు బేవార్స్‌ బ్యాచ్‌గా నటించారు.
 
సాంకేతికత..
చిత్రానికి సినిమాటోగ్రఫీ కనువిందుగా ఉంది. ప్రతి ఫ్రేమ్‌ రిచ్‌గా చూపించాడు. సంగీతపరంగా తమన్‌ ఇచ్చిన బాణీలు పర్వాలేదు. కొత్తదనం కన్పించకపోయినా బాగున్నట్లుగా అనిపిస్తాయి. సాహిత్యం కూడా అంతే. ప్రకాష్‌ యాక్షన్‌ ఎపిసోడ్స్‌ ఎక్కువగానే ఉన్నాయి. సంభాషణలపరంగా ఇద్దరు రయితలు వీరభదమ్ర్‌కు హెల్ప్‌ అయ్యారు. ప్రాసల కోసం తపించే డైలాగ్స్‌ ఇందులో ఉన్నాయి. ఫారిన్‌పోవాలనుకుంటే.. ఫార్మర్‌గా మారాను.. వంటి కొన్ని డైలాగ్స్‌ ఫర్వాలేదు. డాన్స్‌పరంగా శ్రీధర్‌ కంపోజింగ్‌ ఓకే. నిర్మాణపు విలువలు బాగున్నాయి.
 
విశ్లేషణ:
మూడేళ్ళ రాసుకున్న కథ.. ఎక్కడా కొత్తదనం కన్పించదు. నాని, శర్వానంద్‌‌లాంటివారు చేయాల్సిన కథ అని దర్శకుడు చెప్పినా.. రొటీన్‌గా ఉండటంతో వద్దనుకున్నట్లుగా అనిపిస్తుంది. 'పూలరంగడు', 'కందిరీగ'.. మొన్న వచ్చిన 'చెన్నై ఎక్స్‌ప్రెస్'‌.. వంటి చిత్రాల ఛాయలు కన్పిస్తాయి. ఓ దశలో ఎంటర్‌టైన్‌మెంట్‌పరంగా 'చెన్నై ఎక్స్‌ప్రెస్'‌.. తరహాలో ఉంటుందని దర్శకుడు సెలవిచ్చాడు. అలాంటప్పుడు అదే కథను మళ్ళీమళ్ళీ తీయడం ఎందుకో అర్థంకాదు. నిర్మాతలైనా.. కథ విన్నప్పుడు ఏదో కొత్తదనం వారికి అనిపించాలి. కానీ రొటీన్‌ ఫార్మెట్‌ కథలతో తీసిన ఈ చిత్రం ఆర్టిస్టులపరంగా సాయికుమార్‌కు, ఆదికి కొత్తగా ఉండవచ్చు.
 
రొటీన్‌గా తెలుగు సినిమాలో ఉన్నట్లే.. క్లెమాక్స్‌ వరకు.. హీరోయిన్‌.. హీరోను ప్రేమించినా చెప్పలేదు. పెద్దలు అమ్మాయికి వేరే సంబంధం చూసి పెళ్లిపీటలదాకా తెస్తారు. ఆటైమ్‌లో హీరో తండ్రి.. ప్రొసీడ్‌ అనడం.. హీరో వచ్చి హీరోయిన్‌ను పెళ్లిపీటల నుంచి తీసుకెళ్లడం.. అడ్డువచ్చిన కొంతమందిని కొట్టడం.. రొటీన్ ఫార్ములాతో ఈ చిత్రం కొనసాగుతుంది. ఎంతోమంది కొత్తదర్శకులు, కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతున్న ఇండస్ట్రీలో ఇంకా బూజుపట్టిన కథల్తో కథనాలతో తీయడం విడ్డూరమే. కేవలం మాస్‌ను ఆలరించే ప్రేక్షకులకు ఇది సూటవుతుంది. దీని గురించి ఇంతకంటే విశ్లేషించడం అనవరం. 
 
రేటింగ్ : 2/5