శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By pnr
Last Updated : బుధవారం, 11 జనవరి 2017 (08:37 IST)

కథ + కథనం + వినోదం + సందేశం + ఉద్వేగభరిత సన్నివేశాల మేళవింపు = "ఖైదీ" (రివ్యూ).. బంపర్ హిట్ టాక్..

'ఖైదీ నంబర్ 150' చిత్ర కథ వినోదం, సందేశం మేళవింపుగా సినిమా రూపుదిద్దాడు. కత్తి శీను పాత్ర ఎలా మలుపులు తిరుగుతుందీ.. అతడికీ, విలన్‌కీ మధ్య ఎలా యుద్ధం జరుగుతుంది. వంటి వాటిని దర్శకుడు ఆసక్తికరంగా మలిచార

రివ్యూ: ఖైదీ నంబర్‌ 150
నటీనటులు: చిరంజీవి, కాజల్‌ అగర్వాల్‌, తరుణ్‌ అరోరా, రాయ్‌ లక్ష్మి, బ్రహ్మానందం, అలీ, పోసాని కృష్ణమురళి, జయప్రకాశ్‌ రెడ్డి తదితరులు. 
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌ 
దుస్తులు‌: కొణిదెల సుస్మిత 
ఛాయాగ్రహణం: ఆర్‌.రత్నవేలు 
మాటలు: పరుచూరి బ్రదర్స్‌, బుర్రా సాయి మాధవ్‌, వేమారెడ్డి 
నిర్మాత: రామ్‌చరణ్‌ 
సమర్పణ: కొణిదెల సురేఖ 
మూలకథ: మురుగదాస్‌ 
దర్శకత్వం: వి.వి.వినాయక్‌ 
విడుదల తేదీ: 11.1.2017  
 
డేరింగ్‌, డాషింగ్‌, డైనమిక్‌ హీరోగా తెలుగు ప్రేక్షకుల్ని తన సినిమాలో ఉర్రూతలూగించి కోట్లమంది అభిమానుల్ని సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం "ఖైదీ నంబర్ 150" భారీ అంచనాల మధ్య విడుదలైంది. ఈ చిత్రం తొలి ఆటలోనే బంపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా.. చిరంజీవికి ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకుని దర్శకుడు వివి వినాయక్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. 

'ఖైదీ నంబర్ 150' చిత్ర కథ వినోదం, సందేశం మేళవింపుగా సినిమా రూపుదిద్దాడు. కత్తి శీను పాత్ర ఎలా మలుపులు తిరుగుతుందీ.. అతడికీ, విలన్‌కీ మధ్య ఎలా యుద్ధం జరుగుతుంది. వంటి వాటిని దర్శకుడు ఆసక్తికరంగా మలిచారు. ఒక పక్క కథనం వేగంగా సాగుతుండగానే అలరించే పాటలూ, రైతుల పరిస్థితిని కళ్లకు కట్టే సన్నివేశాలూ, కామెడీ పంచ్‌లూ వరుస కడతాయి. ఇది 'కత్తి'కి రీమేక్‌. అయితే చిరంజీవి రేంజ్‌కి తగ్గట్టుగా పాటల్నీ, ఫైట్స్‌నీ బాగా చిత్రీకరించారు. ఈ కథను ఓ సారి సమీక్షిస్తే... 
 
తొమ్మిది సంవత్సరాల తర్వాత 'బాస్‌ ఈజ్‌ బ్యాక్‌' అంటూ మళ్లీ వెండితెరపై ప్రత్యక్షం అవుతున్న మెగాస్టార్‌ మూవీ ఇది. రామ్‌చరణ్‌ నిర్మాతగా అందిస్తోన్న తొలి సినిమా ఇది. అన్నింటికంటే మించి ఇది 'అన్నయ్య' 150వ సినిమా... సంక్రాంతి బరిలో ముందొచ్చిన చిత్రం. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ సినిమా... తమిళ చిత్రం 'కత్తి'కి రీమేక్‌గా మన ముందుకొచ్చింది. మరి ఈ మెగా మూవీ కథ, మాటలు, పాటలు, పోరాటాలు, పంచ్‌డైలాగ్‌ల విషయంలో ఎన్నిమార్కులు సంపాదించుకుంటుందీ... సినిమా అభిమానుల్ని ఎలా అలరిస్తుందీ... 'చిరు' సెకండ్‌ ఇన్నింగ్స్‌లో ఏ స్థాయిలో సూపర్‌ అనిపించారు వంటి విశేషాలు తెలియాలంటే.. ఈ సమీక్ష చదవాల్సిందే!!
 
కథేంటంటే: కోల్‌కతా కేంద్ర కారాగారంలో కత్తి శీను కనిపించటంతో కథ మొదలవుతుంది. అల్లరి చిల్లరి దొంగ అయిన కత్తి శీను జైలు నుంచి తప్పించుకుని హైదరాబాద్‌కు చేరుకుంటాడు. అక్కడి నుంచి బ్యాంకాక్‌కు పారిపోయే సమయంలో లక్ష్మి (కాజల్)ని చూసి ప్రేమలో పడతాడు. ఫారిన్ వెళ్లాలనుకున్నప్పటికీ లక్ష్మి కోసం ఆగిపోతాడు. ఆసమయంలోనే తన ఎదురుగా ఒకరిపై హత్యాయత్నం జరుగుంది. అతను తనలానే ఉండటంతో ఆశ్చర్యానికి గురి అవుతాడు. తనలా ఉన్న శంకర్ (చిరంజీవి ద్విపాత్రాభినయం)ను కాపాడి ఆసుపత్రిలో చేరుస్తాడు. శంకర్ ఎవరంటే.. రైతుల పక్షాన నిలిచి వారి కోసం పోరాడే రైతు నాయకుడు.
 
ఈ క్రమంలో మళ్లీ ఫారిన్ వెళ్లటానికి ప్రయత్నాలు చేసుకుంటున్న వేళ.. కత్తి శీనును శంకర్‌గా భావించిన కలెక్టర్ అతన్ని రైతులున్న వృద్ధాశ్రమానికి తీసుకొస్తాడు. కార్పొరేట్ సంస్థల అధిపతి అగర్వాల్ (తరుణ్ అరోరా) రైతుల భూముల్ని కాజేసి.. అక్కడో శీతల పానీయాల కంపెనీని పెట్టాలనుకుంటాడు. కత్తి శీనును చూసిన అగర్వాల్ అతన్ని రైతు నాయకుడు శంకర్‌గా భావించి... రైతుల భూముల్ని తనకిచ్చేలా చేస్తే రూ.25 కోట్లు ఇస్తామని బేరం పెడతాడు. దీనికి సరేనంటాడు శంకర్ రూపంలో ఉన్న కత్తి శీను.
 
ఈ దశలో శంకర్‌కు ఓ సన్మాన కార్యక్రమం జరుగుతుంది. ఆ సమయంలో శంకర్ పూర్వాపరాలు కత్తి శీనుకు తెలుస్తాయి. రైతుల క్షేమం కోసం శంకర్ ఎంతగా తపిస్తాడన్నది తెలుసుకున్న కత్తి శీను.. అతని బాటలో నడవాలని నిర్ణయించుకుంటాడు. అదేసమయంలోనే అగర్వాల్ కుతంత్రం ఏమిటో పసిగడుతాడు. ఇక రైతుల భూముల్ని కాజేయాలనుకున్న అగర్వాల్ కుట్రకు చెక్ చెబుతూ.. రైతుల పక్షాన నిలిచే ప్రయత్నం చేస్తాడు. దీంతో కార్పొరేట్ సంస్థల అధిపతి అగర్వాల్‌కు.. రైతు నాయకుడు శంకర్‌గా మారిన కత్తి శీనుకు మధ్య అసలైన పోరాటం మొదలవుతుంది. అగర్వాల్ కుట్రను ఏ విధంగా అడ్డుకున్నాడు? రైతుల పంట భూములు కోల్పోకుండా చేశాడా? అగర్వాల్‌కు చెక్ పెట్టేందుకు కత్తి శీను వేసిన వ్యూహం ఫలించిందా? శంకర్ ఏమయ్యాడు? లక్ష్మీ.. కత్తి శ్రీనుల ప్రేమకథ సుఖాంతమైందా? కత్తి శీను ఫారిన్ ప్రయాణం ఏమైంది? అనేవి తెలుసుకోవాలంటే వెండితెరపై చూడాల్సిందే. 
 
చిత్రం ఎలా ఉందంటే... వినోదం, సందేశం మేళవింపుగా సినిమా రూపుదిద్దుకుంది. కత్తి శీను పాత్ర ఎలా మలుపులు తిరుగుతుందీ.. అతడికీ, విలన్‌కీ మధ్య ఎలా యుద్ధం జరుగుతుంది వంటి సన్నివేశాలను దర్శకుడు ఆసక్తికరంగా మలిచారు. ఒక పక్క కథనం వేగంగా సాగుతుండగానే అలరించే పాటలూ, రైతుల పరిస్థితిని కళ్లకు కట్టే సన్నివేశాలూ, కామెడీ పంచ్‌లూ వరుస కడతాయి. ఇది తమిళ చిత్రం 'కత్తి'కి రీమేక్‌. కానీ, తెలుగులో మాత్రం చిరంజీవి రేంజ్‌కి తగ్గట్టుగా పాటల్నీ, ఫైట్స్‌నీ బాగా చిత్రీకరించారు. 'అమ్మడూ.. లెట్స్‌డూ కుమ్ముడూ' పాటలో రామ్‌చరణ్‌ తళుక్కుమని మెరుస్తాడు. 'రత్తాలూ..' 'సన్నజాజిలా పుట్టేసిందిరో, మల్లెతీగలా చుట్టేసిందిరో' పాటలు హుషారెక్కిస్తాయి. 'అమ్మడూ లెట్స్‌ డూ కుమ్ముడూ' కుర్రకారుతో ఈలలేయిస్తుంది.
 
నటన పరంగా... తొమ్మిదేళ్ల తర్వాత రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన చిరంజీవి మునుపటిలాగానే తన నటనతో రెండు పాత్రల్ని పండించారు. డాన్సుల్లోనూ ఒకప్పటి హుషారు కనిపిస్తుంది. చిరంజీవి సరసన కాజల్‌ అందంగా కనిపించింది. దర్శకుడిగా వి.వి.వినాయక్‌ చిరంజీవి ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని కథనాన్ని నడిపించారు. దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం, రత్నవేలు ఫొటోగ్రఫీ బాగున్నాయి. బ్రహ్మానందం, పోసాని, జయప్రకాశ్‌రెడ్డి వాళ్ల పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. మొత్తంమీద ఈ చిత్రం కేవలం అభిమానులకే కాదు.. ప్రతి సినీ ప్రేక్షకుడికి సంక్రాంతి పండగే.