శుక్రవారం, 15 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By pnr
Last Updated : గురువారం, 26 జనవరి 2017 (15:58 IST)

ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టిన మంచు విష్ణు... ‘లక్కున్నోడు’ రివ్యూ

'ఢీ', 'దేనికైనా రెఢీ', 'ఈడోరకం-ఆడోరకం' వంటి కామెడి ఎంటర్‌టైనర్‌తో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్న హీరో మంచు విష్ణు. ఇపుడు మరోసారి కామెడీ ఎంటర్‌టైనర్‌తోనే "లక్కున్నోడు" చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చా

నిర్మాణ సంస్థ: ఎం.వి.వి.సినిమా
తారాగణం: మంచు విష్ణు, హన్సిక మోత్వాని, తనికెళ్ళ భరణి, వెన్నెల కిషోర్‌, పోసారి కృష్ణమురళి, ప్రభాస్‌ శ్రీను, సత్యంరాజేష్‌ తదితరులు
సంగీతం: అచ్చు, ప్రవీణ్‌ లక్కరాజు
స్క్రీన్‌ప్లే, మాటలు: డైమండ్‌ రత్నబాబు
నిర్మాత: ఎం.వి.వి.సత్యనారాయణ
కథ, దర్శకత్వం: రాజ్‌కిరణ్‌
 
'ఢీ', 'దేనికైనా రెఢీ', 'ఈడోరకం-ఆడోరకం' వంటి కామెడి ఎంటర్‌టైనర్‌తో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్న హీరో మంచు విష్ణు. ఇపుడు మరోసారి కామెడీ ఎంటర్‌టైనర్‌తోనే "లక్కున్నోడు" చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గీతాంజలి, త్రిపుర వంటి హర్రర్‌ చిత్రాలను డైరెక్ట్‌ చేసిన రాజ్‌కిరణ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. 'దేనికైనా రెడీ', 'పాండవులు పాండవులు తుమ్మెద' వంటి విజయవంతమైన చిత్రాల్లో విష్ణుతో జత కట్టిన హన్సిక ఈ సినిమాలో మూడోసారి విష్ణు సరసన నటించింది. మరి ఈ సారి విష్ణు ప్రయత్నం ఫలించిందా..? హన్సికతో జోడి కట్టడం వల్ల విష్ణు సక్సెస్‌ అందుకున్నాడా? అని తెలియాలంటే కథలోకి వెళదాం...
 
కథను పరిశీలిస్తే...  
లక్కీ(మంచు విష్ణు) దురదృష్టవంతుడు. అతని దురదృష్టం కారణంగా అతని తండ్రి కూడా లక్కీతో మాట్లాడడు. అలాంటి లక్కీ ఓ రోజు పద్మావతిని చూసి ప్రేమలో పడతాడు. పద్మావతి ప్రతి విషయాన్ని మంచి కోణంలోనే ఆలోచించే మనస్తత్వం గల అమ్మాయి. కథ ఇలా సాగుతుండగా లక్కీ తన చెల్లి పెళ్ళి కోసం తీసుకెళ్తున్న డబ్బు బ్యాగ్‌ను ఎక్కడో మిస్ అవుతుంది. ఆ బ్యాగ్‌లో పాతిక లక్షల రూపాయలు ఉంటాయి. ఏం చేయాలో తెలియక లక్కీ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. అంతో ఓ వ్యక్తి లక్కీకి ఓ బ్యాగ్‌ ఇచ్చి దాన్ని ఓ రోజు జాగ్రత్తగా దాస్తే కోటి రూపాయలిస్తానని చెబుతాడు. ఇంతకు ఆ వ్యక్తి ఎవరు? ఆ బ్యాగ్‌లో ఏముంటుంది? లక్కీకి కోటి రూపాయలు వచ్చిందా? అనే విషయాలను వెండితెరపై చూడాల్సిందే. 
 
విశ్లేషణ:
ఈ చిత్రంలో హీరో మంచు విష్ణు తనదైన నటనతో లక్కీ పాత్రలో ఎనర్జిటిక్‌ పెర్‌ఫార్మెన్స్‌ చేశాడు. డ్యాన్సులు, యాక్షన్‌ సీన్స్‌లో చక్కగా చేశాడు. చాలా గ్యాప్‌ తర్వాత తెలుగులో నటించిన హన్సిక తన పాత్ర పరంగా న్యాయం చేసింది. విలన్‌ పాత్రలో నటించిన నిర్మాత ఎం.వి.వి.సత్యనారాయణ కూడా మంచి నటనను కనపరిచాడు. నటీనటులందరూ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. దర్శకుడు రాజ్‌కిరణ్‌ అనుకున్న సింపుల్‌ పాయింట్‌ను రెండు గంటల సినిమాగా నడపడంలో పెద్దగా సక్సెస్‌ కాలేదు. దురదృష్టవంతుడిగా భావించే హీరో ఎలా లక్కున్నోడు అయ్యాడో అనే కథను బోరింగ్‌ కథనంతో తెరకెక్కించిన విధానం ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టేలా ఉంది. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్తా పని చెప్పి ఉంటే బావుండేది. రొటీన్‌ కామెడీయే అయినా ప్రేక్షకుడు నవ్వుకోవడానికి సరిపోతుంది. 
 
రేటింగ్‌: 2.25/5