శనివారం, 28 సెప్టెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : శనివారం, 1 జులై 2023 (07:08 IST)

దశరథ్‌ నిర్మించిన లవ్‌ యు రామ్‌ ఎలా వుందంటే! రివ్యూ

Rohit Behal, Aparna
Rohit Behal, Aparna
రోహిత్‌ బెహల్‌, అపర్ణ జనార్దనన్‌, బెనర్జీ, కాదంబరి కిరిణ్‌, దశరథ్‌ తదితరులు నటించిన సినిమా లవ్‌ యు రామ్‌. మన ఎంటర్‌టైన్‌మమెంట్‌, శ్రీచక్ర ఫిలిమ్స్‌పై డీవీ.చౌదరి, దశరథ్‌ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి దశరథ్‌ కథ ససమకూర్చారు. వేద సంగీతం సమకూర్చిన ఈ సినిమా ఈనాటి ట్రెండ్‌కు తగిన ప్రేమకథగా చెప్పారు. సాయి సంతోష్‌ సినిమాటోగ్రఫీ అందించిన ఈ సినిమా శుక్రవారమే విడుదలైంది. మరి ఎలా వుందో చూద్దాం.
 
కథ:
రామ్‌ (రోహిత్‌ బెహల్‌) స్పూర్తిదాయకంగా వుంటాడు. అలాంటి వ్యక్తి నార్వేలో శ్రీనివాస హోటల్‌ రన్‌  చేస్తుంటాడు. ఈ  బిజినెస్‌ చైన్‌కి సి.ఈ.ఓ.గా దశరథ్‌ వుంటాడు. అయితే రామ్‌ జీవితంలో కొన్ని ఎదురుదెబ్బలు తినడంతో ఓ దశలో సెల్‌ఫిష్‌గా మారిపోతాడు. అందుకే బిజినెస్‌ టాక్స్‌ ఎగొట్టేందుకు ప్లాన్‌ చేస్తాడు. ఆ క్రమంలో తన భార్య కమ్‌ ఉద్యోగినిగా వుండేందుకు ఓ అమ్మాయిని పెండ్లి చేసుకోవాలనుకుంటాడు. ఈ విషయం ఆ అమ్మాయికి తెలికుండా జాగ్రత్తపడాలనుకుంటాడు. అందుకు సి.ఇ.ఓ. దశరథ్‌ను సంప్రదిస్తాడు. అందుకు అతను ఎంపిక చేసిన ఐదుగురు అమ్మాయిలలో దివ్య (అపర్ణ)ను ఫైనల్‌ చేస్తాడు రామ్‌. ఆ తర్వాత పలు నాటకీయ పరిణామాలు జరిగాక పెండ్లికి ఓ గంట ముందు రామ్‌ గురించి దివ్యకు అసలు నిజం తెలుస్తుంది. ఆ తర్వాత ఏమయింది? అనేది మిగిలిన సినిమా.
 
సమీక్ష:
ఇటువంటి కథ ఇప్పటి ట్రెండ్‌కు తగినట్లుగానే వుంది. సోషల్‌మీడియా ద్వారా చాలామంది ప్రేమికులుగా మారడం చూస్తునే వున్నాం. అలాంటి ప్రేమపక్షులు హీరోహీరోయిన్లు. మొదట్లో బాగానే వున్న వారి పరిచయాలు తర్వాతతర్వాత వారి గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాక ఆ ప్రేమ ఎటువైపు మలుపుతిరిగాయి అనేది ఇందులో చూపించాడు. ఓ అబ్బాయిని ఒక అమ్మాయి చిన్నప్పటినుంచి ఇష్టపడుతూ స్పూర్తిగా తీసుకుంటూ పెద్దయ్యాక అతను క్యారెక్టర్‌ మారిపోతే ఆ అమ్మాయి పరిస్థితి ఏమిటి? అనేది ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశాడు. అయితే దాన్ని ప్రజెంటేషన్‌ చేయడంలో కొంత తడబాటు దర్శకునిలో కనిపించింది. పూర్వం సీరియల్స్‌ తీసి దర్శకత్వం వహించిన దర్శకుడు చౌదరికి సినిమా కొత్త ప్రయత్నమే. అయితే దర్శకుడు దశరథ్‌ తోడుకావడంతో కాస్త బెటర్‌ అనేలా చూపించాడు.
 
ఇక ఫస్టాఫ్‌లో ట్విస్ట్‌ బాగుంటుంది. ఆన్‌లైన్‌ ప్రేమ. హీరో ఓ అమ్మాయిని ప్రేమించడం ఆమె లేచిపోవడం.. ఇలా మరలా హీరోయిన్‌ ఇంటికి రావడం. ఆ తర్వా జరిగే డ్రామా ఎంటర్‌టైన్‌గా చూపించాడు. ఇంటర్‌వెల్‌వరకు సాఫీగా జరిగే కథ సెకండాఫ్‌లో రొటీన్‌గా మారిపోతుంది. దివ్యను ఇంప్రెస్‌ చేయడం కోసం రామ్‌ ప్రయత్నాలు, ఆ తర్వాత రామ్‌ గురించి తెలుసుకోవడం ఆ తర్వాత మరో ఛాన్స్‌ ఇవ్వడం అనేది రొటీన్‌గా అనిపిస్తాయి. ఇందులో దశరథ్‌ పాత్ర చాలా ఎంటర్‌టైన్‌గా వుంది. దానికి బెనర్జీ పాత్ర కూడా తోడయింది.
 
రామ్‌ పాత్రకు న్యాయం చేశాడనే చెప్పాలి. గ్రామీణ యువతిగా అపర్న సరిపోయింది. దర్శకుడు దశరథ్‌ రచయిత కావడంతో తను రాసిన డైలాగ్స్‌ బాగానే పండాయి. కాదంబరి కిరణ్‌తోపాటు పలు పాత్ర తగిన విధంగా నటించాయి. టెక్నికల్‌ అందరూ తగినవిధంగా సమకూరారు. నేపథ్య సంగీతం వేద బాగా చేశాడు. సాయి సంతోస్‌ కెమెరా పనితనం ఓకే. దర్శకుడిగా చౌదరి కొంచెం విభిన్నంగా చూపిస్తే సినిమా మరింత ఆకట్టుకునేది. కొత్తవారితో తను చేసిన ప్రయత్నం అభినందనీయమే. దశరథ్‌ తోడుకావడంతో ఈ సినిమా క్రేజ్‌ ఏర్పడింది. మరి ఈ సినిమా ప్రేక్షకులు ఏమేరకు ఆదరిస్తారో చూడాలి.
రేటింగ్‌: 2.75/5