గురువారం, 4 జులై 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 14 జులై 2023 (12:04 IST)

ఈ తరం ముక్కోణపు ప్రేమ కథ బేబీ - ఎలా ఉందంటే రివ్యూ

Anand Devarakonda, Viraj Ashwin, Vaishnavi
Anand Devarakonda, Viraj Ashwin, Vaishnavi
నటీనటులు: ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య, నాగబాబు, లిరిష, కుసుమ, సాత్విక్ ఆనంద్, బబ్లూ, సీత, మౌనిక, కీర్తన తదితరులు
 
సాంకేతికత: సినిమాటోగ్రఫీ: ఎం.ఎన్. బాల్ రెడ్డి, సంగీతం: విజయ్ బుల్గానిన్, నిర్మాతలు: ఎస్.కె.ఎన్, సాయి రాజేష్ నీలం
 
ఓ తరహా కథలు చేసున్న ఆనంద్ దేవరకొండ నటించిన తాజా సినిమా బేబీ. విజయ్ దేవరకొండ తమ్ముడిగా రంగ ప్రవేశం చేసాడు. ఈ బేబీ సినిమా నిన్న రాత్రి చూసిన విజయ్.. లవ్, లవ్.. లవ్.. నేను గర్వంగా ఫిల్ అవుతున్నానాని పోస్ట్ చేసాడు. అంతలా నచ్చిన ఈ సినిమా ఎస్ కె ఎన్ నిర్మాతగా, సాయి రాజేష్ తెరకెక్కించిన ఈ బేబీ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం.
 
కథ :
ఆనంద్ (ఆనంద్ దేవరకొండ) తన బస్తీలో ఉండే వైష్ణవి (వైష్ణవి చైతన్య)ను టెన్త్ నుంచే  ప్రేమిస్తాడు. కానీ టెన్త్ ఫెయిల్ అయిన ఆనంద్  ఆటో డ్రైవర్ గా మారతాడు. వైష్ణవి పాస్ అయి ఇంజనీరింగ్ లో జాయిన్ అవుతుంది. అక్కడ రాజ్ (విరాజ్ అశ్విన్) పరిచయం అవుతాడు. అక్కడ  కల్చెర్ తో రాజ్ తో పబ్ నుంచి  బెడ్ వరకు సాగుతుంది. అయినా ఎటూ తేల్చుకోలేని బేబీ మరోవైపు ఆనంద్ నూ ప్రేమిస్తున్నట్లు చెపుతుంది. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాలతో 31 రోజులు రాజ్ తో వైష్ణవి డేటింగ్ కు వెళుతుంది. మరి ఈ విషయం ఆనంద్ కు తెలుసా. ఆ తర్వాత ఏమైంది అనేదే మిగిలిన కథ. 
 
సమీక్ష:
ఇది ఫక్తు ఇప్పటి తరం కథ. ఒక అబ్బాయి ఇద్దరు  అమ్మాయిలను ప్రేమించడం రొటీన్. కానీ అందుకు రివర్స్ ఈ బేబీ సినిమా. ఒక అమ్మాయి ఇద్దరినీ ప్రేమిస్తూ ఒకరికి కిస్ ఇస్తూ మరొకరికి ఐ లవ్ యూ అని చెప్పడం ఇంటర్వెల్ ట్విస్ట్. ఇలాంటి కథలు గతంలో వచ్చాయి. కానీ ఈ బేబీ లో దానికి కొనసాగింపుగా ఉంది. చివరివరకు ఇద్దరు ఇష్టమే అనేంతగా బేబీ పాత్ర దర్శకుడు డిజైన్ చేసిన తీరు యూత్ కు కనెక్ట్ అవుతుంది. ఫైనల్గా చిన్న పొరపాటు ఆమె జీవితంలో ఎలాంటి పరిస్థితికి తెచ్చింది అనేది ముగింపు. 
 
ప్రేమించు కోవడం, గిఫ్ట్ లు కొని ఇవ్వడం, తీసుకోవడం వంటి వాస్తవిక అంశాలు, అలాగే ఎమోషనల్ గా సాగే లవ్ ట్రాక్, ఆనంద్ దేవరకొండ పాత్రలోని ఎమోషన్స్, వైష్ణవి చైతన్య పాత్రలోని బలహీనతలు.. ఇలా కథలోని ప్రధాన ఎలిమెంట్స్ సినిమా స్థాయిని పెంచాయి. పాఠశాల, కాలేజీల్లో ఈతరం ఎలా ఉంటున్నారు. అమ్మాయి చుట్టుపక్కల ఫ్రెండ్స్ కూడా ఏ విధంగా బేబీ జీవితాన్ని చేతులోకి తీసుకున్నారు అనేది కళ్ళకు కట్టినట్లు తెలిపాడు. 
 
హృదయ కాలేయం చేసిన దర్శకుడు సాయి రాజేష్ ఇందులో బలమైన ఎమోషనల్ రాసుకున్నారు. అలాగే ఆనంద్ దేవరకొండకి, వైష్ణవి చైతన్యకి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా అలరిస్తుంది. మానసిక సంఘర్షణతో అనుక్షణం నరకం అనుభవిస్తూ ఉండే పాత్రకు ఆనంద్ పూర్తి న్యాయం చేశాడు.
 
యూ ట్యూబర్ గా ఫేమస్ అయిన హీరోయిన్ వైష్ణవి చైతన్య కొన్ని సీన్స్ లో తన కళ్లల్లో పలికించిన హావభావాలు మెచ్చుకోదగినవి. కీలక పాత్రలో నటించిన విరాజ్ అశ్విన్ తన నటనతో ఆకట్టుకోగా  ఇక ఎప్పటిలాగే తండ్రి పాత్రలో కనిపించిన నాగబాబు నటించాడు. వైవా హర్ష, లిరిష, కుసుమ, సాత్విక్ ఆనంద్ వంటి నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు నటించారు.
 
ఇది సాయి రాజేష్ కొందరి జీవితాల్లోని సంఘటనలు, పరిస్థితుల ఆధారంగా రాసుకున్న కథ.  మొదటినుండి బేబీ పై పూర్తి నమ్మకంతో ఉన్నాడు. పెక్యులర్ పాత్ర వైశ్యవిది. ఆమె మొదట చేయలేమోనని భయపడితే ఆమెకు దైర్యం చెప్పి చేయించాడు. కొన్ని ఏమోషనల్ సన్నివేశాలను చాలా బాగా మలిచాడు. సినిమాలో కొన్ని సన్నివేశాలు బాగా స్లోగా సాగుతూ రెగ్యులర్ ఫీల్ కలిగిస్తాయి. కొన్ని  హీరోయిన్ ట్రాక్ లోని సీన్స్ కూడా పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు. అలాగే హీరో హీరోయిన్ల మధ్య ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని లవ్ సీన్స్ కూడా ల్యాగ్ అనిపిస్తాయి. మొత్తంగా రెగ్యులర్ ప్లే, స్లో నేరేషన్ వంటి అంశాలు సినిమాకి కొంతవరకు మైనస్ అయ్యాయి. 
 
సినిమాలో సినిమాటోగ్రఫీ, సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ అందించిన పాటలు ఆకట్టుకున్నాయి. నిర్మాత ఎస్.కె.ఎన్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. దర్శకుడు సాయి రాజేష్ రచయితగా దర్శకుడిగా మరో సారి ఆకట్టుకున్నారు. ఇక ఇద్దరి ప్రేమ కావాలనే కోణంలో ఎటూ తేల్చుకోలేని స్థితిలో బేబీ పాత్రకు ముగింపు బాగా చూపించాడు. ఈ సినిమా ఇప్పటి తరానికి అద్దంలా ఉంది. అమ్మాయిలకు కనువిప్పుగా ఉంది. చూడతగ్గ సినిమా. 
రేటింగ్: 3/5