గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 29 మార్చి 2024 (17:41 IST)

మ్యాజిక్‌తో మాయ చేసిన టిల్లు స్క్వేర్ రివ్యూ, అనుపమా పరమేశ్వరన్ దింపేసిందంటున్న నెటిజన్స్

Sidhu Jonnalagadda, Anupama
Sidhu Jonnalagadda, Anupama
టిల్లూ స్క్వేర్ నటీనటులు: సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్, మురళీ శర్మ, ప్రిన్స్, బ్రహ్మాజీ, మురళీధర్ గౌడ్ తదితరులు
 
సాంకేతికత: సినిమాటోగ్రాఫర్‌: సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు, సంగీత దర్శకులు: రామ్ మిరియాల, అచ్చు రాజమణి, భీమ్స్ సిసిరోలియో, ఎడిటింగ్: నవీన్ నూలి, నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ & సాయి సౌజన్య, దర్శకుడు: మల్లిక్ రామ్
 
తెలుగులో యువ కథానాయకుల్లో ఓ భిన్నమైన వ్యక్తిత్త్వంతో డిజె టిల్లు సినిమాతో గుర్తింపు పొందిన సిద్ధూ జొన్నలగడ్డ స్టార్ బాయ్‌గా నిక్ నేమ్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా “టిల్లు స్క్వేర్ చేశాడు. దర్శకుడు మల్లిక్ రామ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ ట్రైలర్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా నేడు విడుదలైంది. అదెలా వుందో చూద్దాం.
 
కథ :
డి.జె. టిల్లు సీక్వెల్ కాబట్టి దానికి లింక్ చేస్తూ కథ సాగుతుంది. అందులో డిజె టిల్లును రాధిక మోసం చేశాక టిల్లు ఈవెంట్స్ స్టార్ట్ చేసి వెడ్డింగ్ ప్లానింగ్‌లు చేస్తుంటాడు. ఓ రోజు లిల్లి  (అనుపమ) పబ్‌లో కలుస్తుంది. తొలిసారి పరిచయంతోనే లవ్‌లో పడేశాననే ఫీలవుతాడు. అలా ఆ రాత్రి ఓ చోటకు వెళతారు. ఆ తర్వాత నెల రోజులపాటు లిల్లి కనిపించదు. నెల తర్వాత షడెన్‌గా కనిపించి తాను గర్భవతిని అని టిల్లుకు చెబుతుంది. ఈ విషయం తెలిసి టిల్లు ఇంటిలోని వారు ఆమెనే పెళ్లి చేసుకోమంటారు.
 
పెళ్లి చేసుకునే టైంలో తాను ఇండియన్ స్పెషల్ పోలీస్ ఆఫీసర్ అని ట్విస్ట్ ఇస్తుంది. నా కోసం పని చేయాలంటూ.. దుబాయ్ నుంచి ఓ క్రిమినల్ (మురళీశర్మ) వస్తున్నాడు. డిజెగా నిన్నే బుక్ చేసుకున్నాడు కాబట్టి నువ్వే వాడిని చంపేయ్ అని చెబుతుంది. ఇక ఆ ఫంక్షన్‌కి ప్రిన్స్ కూడా వస్తాడు. మొదటి పార్ట్ లో ప్రిన్స్ నుంచే టిల్లు రెండు కోట్లు కొట్టేస్తాడు. ఇప్పుడు ఆ డబ్బులు దుబాయ్ క్రిమినల్ కు ఇవ్వాలి. ఆ తర్వాత టిల్లు, అనుపమ, ప్రిన్స్, బ్రహ్మాజీ పాత్రలు ఎటువైపు మలుపు తిరిగాయి. దుబాయ్ క్రిమినల్‌ను టిల్లు చంపాడా? లిల్లి  చెప్పిన విషయాలు నిజమేనా? అనేవి మిగిలిన సినిమా.
 
సమీక్ష:
డిజె టిల్లు తరహాలోనే ఇది పూర్తిగా ఎంటర్టైన్ చేసేసినిమా. నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ తరహాలో కథనాలు నడుస్తాయి. టీజర్, ట్రైలర్ లో చూపినవిధంగా అనుపమ పాత్ర హైలైట్. తను ఆ పాత్ర మేరకు లిప్ కిస్‌లు వున్నాయి. ఒకరకంగా టిల్లు కంటే తెలివైన అమ్మాయిగా నటించింది. టిల్లును బకరా చేసేంతటి పాత్ర ఆమెది. ఈ రెండు పాత్రలు సినిమాను నడిపిస్తాయి. కథనంతోపాటు సంభాషణల పరంగా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇందుకు త్రివిక్రమ్ సూచనలు బాగా సహకరించాయని తెలుస్తోంది
 
యూత్ కోరుకునే అంశాలు ఇందులో బాగానే వున్నాయి.  మెయిన్ లీడ్ సహా మురళీ శర్మ తన రోల్‌కి న్యాయం చేకూర్చారు.  నటుడు మురళీధర్ గౌడ్ కామెడీ టైమింగ్ ఆకట్టుకుంటాయి. మిగిలిన వారు పరిధి మేరకు నటించారు. వినోదకంటే కాన్సెప్ట్ కొత్తగా ఏమీ లేదు. పార్ట్ 1 లానే రొటీన్ లైన్ తోనే కొనసాగుతుంది. అలాగే కొన్ని సీన్స్ ఊహాజనీతంగానే అనిపిస్తాయి. ఇంకా కొన్ని కీలక ట్విస్ట్ లు మరీ అంత ఎగ్జైట్ చెయ్యవు. లాజిక్ లేకుండా చూపించాడు. దానికితోడు అనుపమ పాత్రలో ట్విస్ట్ పెద్దగా పేలలేదు. కాకపోతే మరో సీక్వెల్‌కు నాందిగా డైలాగ్ లుంటాయి. 
 
నిర్మాణ విలువలు బాగున్నాయి. రామ్ మిర్యాల, అచ్చు సాంగ్స్ భీమ్స్ నేపథ్య సంగీతం  వినసొంపుగా వుంది. సాయి ప్రకాష్ సినిమాటోగ్రఫీ విజువల్స్ తో ఆకట్టుకునేలా ఉంది. నవీన్ నూలు ఎడిటింగ్ కూడా బాగుంది. దర్శకుడు మల్లిక్ రామ్ పనితనానికి సిద్ధూ రచనలో తన పనితనం చూపించాడు. కథనంలో స్పీడ్ గా సాగడంతో కొత్తదనం లేకపోయినా ఎంటర్ టైన్ మెంట్ తో మేనేజ్ చేశారు. ఇలాంటి సినిమాలు ఇప్పటి తరానికి బాగా నచ్చుతాయని చెప్పవచ్చు.  ఏ మేరకు అనేది ప్రేక్షకులే చెప్పగలరు.

రేటింగ్: 3/5