అసక్తి కలిగేలా 'యమన్'... 'బిచ్చగాడు' మామూలోడు కాదు...
'బిచ్చగాడు'తో హిట్ కొట్టి 'భేతాళుడు'తో నెమ్మదించిన తమిళ హీరో విజయ్ ఆంటోనీ నటించిన తాజా చిత్రం 'యమన్'. రాజకీయ నేపథ్యంతో రూపొందిన ఈ చిత్ర టీజర్, ట్రైలర్ బాగుండటంతో ఈ సినిమా మీద మంచి అంచనాలున్నాయి. తమిళంతో పాటు తెలుగులో కూడా రిలీజైన ఈ చిత్రం ఎలాఉంద
విజయ్ ఆంటోని, మియా జార్జ్, త్యాగరాజన్, సంగిలి మురుగన్, చార్లీ, స్వామినాథన్, మారిముత్తు, జయకుమార్, అరుల్ డి. శంకర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన్న ఈ చిత్రానికి సంగీతం: విజయ్ ఆంటోని, ఎడిటింగ్: వీరసెంథిల్ రాజ్, మాటలు: భాష్యశ్రీ, ఫైట్స్: దిలీప్ సుబ్బరాయన్, సమర్పణ: మిర్యాల సత్యనారాయణరెడ్డి, నిర్మాతలు: మిర్యాల రవిందర్‌రెడ్డి, లైకా ప్రొడక్షన్స్, కథ, స్క్రీన్‌ప్లే, సినిమాటోగ్రఫీ, దర్శకత్వం: జీవశంకర్.
'బిచ్చగాడు'తో హిట్ కొట్టి 'భేతాళుడు'తో నెమ్మదించిన తమిళ హీరో విజయ్ ఆంటోనీ నటించిన తాజా చిత్రం 'యమన్'. రాజకీయ నేపథ్యంతో రూపొందిన ఈ చిత్ర టీజర్, ట్రైలర్ బాగుండటంతో ఈ సినిమా మీద మంచి అంచనాలున్నాయి. తమిళంతో పాటు తెలుగులో కూడా రిలీజైన ఈ చిత్రం ఎలాఉందో ఇపుడు తెలుసుకుందాం..
కథ :
దేవరకొండ గ్రామంలో ఆదర్శవాది దేవరకొండ గాంధీ (విజయ్ ఆంటోనీ). అగ్ర కులానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో వెలేస్తారు. కొడుకు పుట్టాడనే విషయంతోనైనా కలుస్తారనే ఆ ఊరికి వెళ్ళిన గాంధీకి అతని బావ అవమానిస్తాడు. దీన్ని తనకనుకూలంగా మలుచుకోవాలని పాండు అనే వ్యక్తి గాంధీని, అతని బావను రాత్రిపూట చంపేస్తాడు. దాంతో పోటీ లేకుండా తనే సర్పంచ్ ఎన్నికల్లో గెలుస్తాడు. భర్త చనిపోయవాడనే దిగులు తనను బతకనీయరనే బెంగతో గాంధీ భార్య ఆత్మహత్య చేసుకుంటుంది. అనాధైన పిల్లాడిని తీసుకుని గాంధీ తండ్రి సిటీలో పెంచుతాడు. అతనే అశోక్ చక్రవర్తి (విజయ్ ఆంటోనీ).
తాతయ్యకు ఆపరేషన్ నిమిత్తం డబ్బు అవసరమై ఒక కేసు విషయంలో వేరొకరి బదులుగా జైలుకు వెళతాడు అశోక్. అక్కడ రెండు గ్యాంగ్స్ మధ్య జరిగే గొడవల్లో ఇరుక్కుంటాడు. ఆ సమయంలో కరుణాకర్ (త్యాగరాజన్) అనే పెద్ద మనిషి అశోక్‌ను బయటపడేసేందుకు, సొంతగా బిజినెస్ పెట్టుకునేందుకు సాయపడతాడు. బిజినెస్ పర్మిషన్ కోసం మంత్రి అయిన పాండురంగ దగ్గరకు అశోక్‌ను కరుణాకరన్ పంపుతాడు. అచ్చు గాంధీలా వున్న అశోక్‌ను చూసి కంగారుపడ్డ పాండు.. శకునిలా తంత్రాలు వుపయోగించి అశోక్‌ను లేపేయాలని ప్లాన్‌లు వేస్తాడు. ఇందుకు కరుణకరన్ సాయం కూడా పాండు తీసుకుంటాడు. అయితే.. వారిద్దరి పన్నాగాలను గ్రహించిన అశోక్ ఇద్దరినీ తుదముట్టించే ప్లాన్ చేస్తాడు. అది నెరవేరిందా? లేదా? తర్వాత కథేమిటనేది మిగిలిన సినిమా.
విశ్లేషణ:
కథ సీరియస్ కాన్సెప్ట్. పల్లెటూరి స్థాయి నుంచి రాష్ట్రస్థాయి రాజకీయాలు ఎలా వుంటాయనేది కథ. రాజకీయ తంత్రాలు, కుతంత్రాలు ఎలా వుంటాయో కళ్లకు కట్టినట్లు దర్శకుడు చూపించాడు. రాజకీయాలనేవి మురికి నీరులాంటివి. అదే రక్తంగా బతికేజాతి.. అంటూ విశ్లేషించిన విధానం బాగుంది. పక్కనున్నవాడ్ని కూడా నమ్మడానికి వీల్లేని దుష్ట రాజకీయ చదరంగంలో ఎత్తుకు పైఎత్తులు ఒకరికొకరు ఎలా వేసుకున్నారనేది ఆసక్తికరంగా చూపగలిగాడు. ఒన్‌మేన్ షో కాబట్టి.. విజయ్ ఆంటోనీ లేని సీన్ కన్పించదు. సీరియస్ మూడ్‌ను బట్టి తన నటించేశాడు. ఇక చాలాకాలం తర్వాత కరుణాకర్ పాత్ర ద్వారా తెలుగువారు త్యాగరాజన్ నటన చూశారు. ఇందులో హీరోయిన్‌తో హీరో పడే ప్రేమ కథ అలరిస్తుంది.
అయితే రాజకీయాలు అంతా ఒకేలా వున్నా.. ఇలాంటివి చూస్తుంటే.. తెలుగులో మనకు తెలిసిన పలు చిత్రాలతోపాటు రక్తచరిత్ర, సర్కార్‌లే గుర్తుకువస్తాయి. బ్యాక్‌గ్రౌడ్ వేరుగా వుంటుంది. హీరోయిన్ మియా జార్జ్‌కు కేవలం రెండు పాటలు, 5 సన్నివేశాలకు మాత్రమే పరిమితం.
సినిమా మాతృక తమిళం కావడం వలన తెలుగు వర్షన్‌లో సైతం చాలాచోట్ల తమిళ వాతావరణం కనబడింది. నటీనటుల నటన కూడా తమిళ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగించింది. దర్శకుడు నేమ్ బోర్డ్స్ వంటి వాటిని కవర్ చేసినా ఆ ఫీల్ పోవడం కష్టమైంది. శకుని, చాణుక్యుని తంత్రాలు కలిస్తే రాజకీయమనే సంభాషణలు బాగున్నాయి. రాజకీయంలో వుండే మైండ్ గేమ్‌తో ఒకరికొకరు అవసరార్థం ఎలా అనుకున్నది అనే అంశాలు ప్రేక్షకులకు మంచి ఆసక్తిని కలిగిస్తాయి. సినిమా ఏకైక బలహీనంగా ఉన్న కథనం యొక్క నిదానాన్ని పట్టించుకోకపోతే ఈ చిత్రాన్ని ఒకసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు.
రేటింగ్: 3/5