Dharma Sangrah
✕

'లైఫ్‌ అంటే నాదే అనుకున్నా'నంటున్న గోపీచంద్ : ఆక్సిజన్ ట్రైలర్

శ్రీసాయిరాం క్రియేషన్స్ పతాకంపై గోపీచంద్, రాశీఖన్నా, అను ఇమ్మాన్యుయేల్‌‌లు జంటగా నటించిన చిత్రం 'ఆక్సిజన్'. ఈ చిత్రం ట్రైలర్ విజయదశమి కానుకగా దర్శకుడు ఎ.ఎమ్‌.జ్యోతికృష్ణ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశ

Written By pnr
Updated: శనివారం, 30 సెప్టెంబరు 2017 (14:32 IST)
శ్రీసాయిరాం క్రియేషన్స్ పతాకంపై గోపీచంద్, రాశీఖన్నా, అను ఇమ్మాన్యుయేల్‌‌లు జంటగా నటించిన చిత్రం 'ఆక్సిజన్'. ఈ చిత్రం ట్రైలర్ విజయదశమి కానుకగా దర్శకుడు ఎ.ఎమ్‌.జ్యోతికృష్ణ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఎస్‌. ఐశ్వర్య నిర్మించిన ఈ చిత్రం పలుమార్లు వాయిదా పడుతూ వస్తోంది. ఈ చిత్రానికి యువన్‌ శంకర్‌ రాజా సంగీతం సమకూర్చగా, త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది.
 
'సంతోషాన్ని పంచే అమ్మానాన్న... నవ్వుతూ పలకరించే ప్రియురాలు.. పిలిస్తే పరిగెత్తుకుంటూ వచ్చే స్నేహితులు.. లైఫ్‌ అంటే నాదే అనుకున్నాను. ఒక్కరోజు అంతా చీకటైపోయింది. నాకు జరిగింది.. మీకూ జరగచ్చు. కానీ అలా జరగనివ్వను' అంటూ ఈ ట్రైలర్‌లో గోపీచంద్ డైలాగ్‌లు చెప్పడం వినిపిస్తుంది. భారీ యాక్షన్ సన్నివేశాలు, కలర్‌ఫుల్ విజువల్స్‌తో ఆకట్టుకునేలా దీనిని రూపొందించారు. ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 
About Author
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... Read More

అన్నీ చూడండి

తొమ్మిది పెళ్ళిళ్లు చేసుకున్న భార్య... ఏడో భర్తపై గృహహింస

మేయర్ వంగవీటి రాధాకృష్ణకు కలిసిన పవన్ కల్యాణ్ (video)

విజయసాయి రెడ్డి కొత్త పార్టీ ప్రకటిస్తారా?

పట్టాలు తప్పిన కోల్‌కతా - సైరంగ్ ఎక్స్‌ప్రెస్ (వీడియో)

బైకు ధర కంటే ట్రాఫిక్ చలానాలో ఎక్కువగా ఉన్న ద్విచక్రవాహనం సీజ్

అన్నీ చూడండి

ప్రపంచ మధుమేహ దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో మేలు

కిడ్నీలు 90 శాతం పాడైపోయేవరకూ లక్షణాలు కనిపించవా?

రుచీపచీ లేని ఈ పండు చేసే మేలు ఎంతో తెలుసా?

ఫ్రిజ్‌లో కోడిగుడ్లు పెడితే ఏమవుతాయి?

ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంత ప్రజలకు తుఫాను అనంతర హెల్త్ అడ్వైజరీ జారీ చేసిన స్టార్ హెల్త్

తర్వాతి కథనం
Show comments