1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 6 అక్టోబరు 2023 (17:02 IST)

ఇండియన్ సైన్ లాంగ్వేజ్ లో టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్‌ కు స్పందన

Tiger Nageswara Rao Trailer  Indian Sign Language
Tiger Nageswara Rao Trailer Indian Sign Language
మాస్ మహారాజా రవితేజ తన తొలి పాన్ ఇండియా చిత్రం టైగర్ నాగేశ్వరరావుతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా వున్నారు. వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్స్ ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2ని అందించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌ అభిషేక్ అగర్వాల్ ప్రతిష్టాత్మకంగా భారీ స్థాయిలో నిర్మించారు. ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరికీ గుర్తుండిపోయేలా చేయడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు . ప్రమోషన్స్‌పై భారీగా  ఖర్చు చేస్తూ, సినిమాపై ఉత్సాహం నింపేందుకు నిర్మాత తన సజెసన్స్ ఇస్తున్నారు.
 
ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను ఇటీవల ముంబైలో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో రవితేజ అండ్ టీం లాంచ్ చేశారు. మేకర్స్ ఇండియన్ సైన్ లాంగ్వేజ్(చెవిటి, మూగ వారిభాష)  లో కూడా ట్రైలర్‌ను విడుదల చేశారు.  అందులో ఒక యాంకర్ క్లిప్‌లోని కంటెంట్‌ను వివరిస్తున్నారు. భారతదేశంలోనే  సైన్ భాషలో విడుదలైన తొలి ట్రైలర్ ఇదే. మిగతా ట్రైలర్స్‌తో పాటు సైన్ లాంగ్వేజ్ ట్రైలర్‌కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
 
ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ చేయాలని అక్టోబర్ 20న ఇండియన్ సైన్ లాంగ్వేజ్ లో కూడా సినిమాను విడుదల చేస్తున్నట్లు నిర్మాత అనౌన్స్ చేశారు. టైగర్ నాగేశ్వరరావు ఇండియన్ సైన్ లాంగ్వేజ్ లో విడుదలైయ్యే మొదటి భారతీయ చిత్రం. భారతీయ సినిమాలో ఇది నిజంగా స్వాగతించదగిన మార్పు.
 
ఈ సినిమా ప్రమోషన్ కోసం మేకర్స్ అంతా రెడీ అవుతున్నారు. తదుపరి ప్రమోషన్‌ల కోసం వారు బిగ్గర్ ప్లాన్స్ తో వున్నారు.  
 
జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని రెండు పాటలను విడుదల చేశారు. ఈ రెండు పాటలు కూడా చార్ట్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ ఈ చిత్రంలో కథానాయికలు.
 
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ ఆర్‌ మదీ ఐఎస్‌సి, ప్రొడక్షన్‌ డిజైనర్‌ అవినాష్‌ కొల్లా. శ్రీకాంత్ విస్సా డైలాగ్ రైటర్ కాగా, మయాంక్ సింఘానియా సహ నిర్మాత.
 
టైగర్ నాగేశ్వరరావు దసరా సందర్భంగా అక్టోబర్ 19న అన్ని దక్షిణాది భాషలు,  హిందీలో విడుదల కానుంది.