తిరుమల శ్రీవారి పట్టువస్త్రాలు సమర్పించిన సిఎం
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎపి సిఎం చంద్రబాబునాయుడు శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించారు. బేడీ ఆంజనేయస్వామి ఆలయం నుంచి శాస్త్రోక్తంగా పట్టువస్త్రాలను తీసుకెళ్ళి వేదపండితులకు సిఎం అందజేశారు. ప్రతియేటా స్వామివారికి ప్రభు
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎపి సిఎం చంద్రబాబునాయుడు శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించారు. బేడీ ఆంజనేయస్వామి ఆలయం నుంచి శాస్త్రోక్తంగా పట్టువస్త్రాలను తీసుకెళ్ళి వేదపండితులకు సిఎం అందజేశారు. ప్రతియేటా స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.
రాత్రి శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయప్పస్వామి చిన్నశేషవాహనంపై వూరేగుతూ భక్తులకు దర్సనమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో మొదటి వాహనం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. చిన్నశేషునిపై చిద్విలాసం చేస్తూ శ్రీవారు భక్తులకు సాక్షాత్కరింపజేశారు. భక్తుల గోవిందనామస్మరణలతో నాలుగు మాడ వీధులు మారుమ్రోగింది.