శ్రీవారి బ్రహ్మోత్సవాలు 2015 షెడ్యూలు.... గరుడ సేవకు పిల్లలతో రావద్దు ప్లీజ్... వస్తే...?
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు దాదాపు పూర్తికావచ్చాయి. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాలు జరగడం మనకు తెలిసిందే. భక్తుల సౌకర్యార్థం బ్రహ్మోత్సవాల షెడ్యూలు....
మొదటి రోజు సాయంత్రం 16-09-15 ధ్వజారోహణం, రాత్రి 9.00 నుంచి 11.00 వరకూ పెద్దశేష వాహనం
రెండో రోజు ఉదయం 17-09-15 ఉదయం గం 9 నుంచి 11 వరకూ చిన్నశేష వాహనం, రాత్రి 9-11 వరకూ హంస వాహనం
మూడోరోజు ఉదయం 18-09-15 సింహవానం, రాత్రి - ముత్యపు పందిరి వాహనం
నాలుగవ రోజు ఉదయం 19-09-15 కల్పవృక్ష వాహనం, రాత్రి- సర్వభూపాల వాహనం
ఐదవ రోజు 20-09-15 రాత్రి గరుడవాహనం
ఆరవ రోజు 21-09-15 ఉదయం హనమద్వాహనం, రాత్రి - గజవాహనం
ఏడవ రోజు 22-09-15 ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి - చంద్రప్రభ వాహనం
ఎనిమిదవ రోజు 23-09-15 ఉదయం రథోత్సవం, రాత్రి - అశ్వవాహనం
తొమ్మిదవ రోజు 24-09-15 ఉదయం చక్రస్నానం
కాగా శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గరుడసేవకు ఈ ఏడాది 6 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నదని తిరుమల అర్బన్ ఎస్పీ సూచించారు. ఈ నేపథ్యంలో భక్తులు తమ వెంట పిల్లలు, వృద్ధులను తీసుకు రావద్దనీ, వచ్చినట్లయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. భక్తులు సహకరించాల్సిందిగా కోరారు. గురువారం నాడు ఆయన తిరుమల మాడవీధులలో ఏర్పాట్లను పరిశీలించారు.